ఇవాళ రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం

ఇవాళ రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3.54గంటల సమయంలో ఏకంగా 13,857 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని, రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్ అని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. మూడు రోజుల క్రితం 13,742 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా.. తాజాగా మరో 100 మెగావాట్లకుపైగా డిమాండ్ పెరిగి 13,857గా నమోదైంది. వ్యవసాయం, పరిశ్రమలు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు అంటున్నారు. 

ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఒకట్రెండు రోజుల్లోనే విద్యుత్ డిమాండ్ 14,000 మెగావాట్లకు పెరగవచ్చని అధికారులు అంటున్నారు. 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు. 

For more news..

నా యాత్ర ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు

కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ పంచాయతీ