రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమితో ఇండ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. మరోవైపు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను  తాగుతున్నారు. మే నెల ఎండింగ్ నుంచి ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ములుగు జిల్లా మేడారంలో 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోరెండు రోజులు రాష్ట్రానికి ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు వడగాలుల తీవ్రత ఉందని హెచ్చరించింది. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్

మ్యాప్లు,మాటలలోనే అభివృద్ధి