తేజ మిర్చి @ రూ.20 వేలు..రెండేండ్ల తర్వాత ఇదే గరిష్ఠ ధర

తేజ మిర్చి @ రూ.20 వేలు..రెండేండ్ల తర్వాత ఇదే గరిష్ఠ ధర

ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో తేజ రకం మిర్చికి బుధవారం రికార్డు ధర పలికింది. రెండేండ్ల తర్వాత క్వింటా మిర్చి రూ. 20 వేల మార్క్‌‌‌‌ను తాకింది. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలకు చెందిన రైతులు బుధవారం ఖమ్మం మార్కెట్‌‌‌‌కు సుమారు 13 వేల బస్తాల కొత్త మిర్చిని తీసుకువచ్చారు. 

మూడేండ్ల కింద ఏకంగా రూ. 25 వేలు పలికిన తేజ రకం మిర్చి.. ఆ తర్వాత రూ.18 వేలలోపే పరిమితం అయింది. తేజ రకం మిర్చి ధర రెండు, మూడు రోజులుగా పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌‌‌‌ ఇలాగే ఉంటే.. రేటు మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.