డిజిటల్​ క్లాసుల రికార్డింగ్ ​స్టార్ట్

డిజిటల్​ క్లాసుల రికార్డింగ్ ​స్టార్ట్
  • మళ్లీ ప్రతి స్కూల్​ నుంచి కొందరు టీచర్ల ఎంపిక
  • సెలవులు పొడిగించడంతో రీ షెడ్యూల్​ చేసిన ఆఫీసర్లు
  • నైన్త్, టెన్త్ ​స్టూడెంట్స్ పై స్పెషల్ ఫోకస్​
  • ఆన్​లైన్​లో వర్క్ ​షీట్స్, రివిజన్​ క్లాసుల నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్​స్కూళ్లలో చదువుకునే పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం టీశాట్, దూరదర్శన్ వంటి చానెల్స్​ద్వారా రికార్డెడ్ క్లాసులు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్​లో స్కూళ్లు రీఓపెన్ అవ్వడంతో ఆన్లైన్ క్లాసులను ఆపేశారు. టీచర్లందరూ నేరుగా స్కూళ్లలోనే లెస్సెన్స్​చెబుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో నెలాఖరు వరకు ప్రభుత్వం స్కూళ్లకు హాలిడేస్​పొడిగించింది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే డౌట్​తో సెప్టెంబర్​లో ఆపేసిన క్లాసుల రికార్డింగ్​ను తిరిగి ప్రారంభించింది. ఈ నెల 27 వరకు క్లాసులు రికార్డ్​చేసేలా ఆఫీసర్లు ప్లాన్​చేశారు. లెర్నింగ్ గ్యాప్​తో ఎగ్జామ్స్​ఎలా రాయాలా అని ఒత్తిడికి గురౌతున్న నైన్త్, టెన్త్​క్లాస్​పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. హాలిడేస్​ఉన్నన్ని రోజులు సబ్జెక్ట్​టీచర్లు డైలీ రెండు గంటలు ఆన్​లైన్​లో రివిజన్ క్లాసులు తీసుకుంటున్నారు. 
ఆరు నుంచి పది వరకు 
స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నుంచి సర్కారు స్కూళ్ల మేనేజ్మెంట్లకు గత మంగళవారం షెడ్యూల్ చార్ట్​అందింది. అందులో క్లాస్ వైజ్​గా సబ్జెక్టులో చెప్పాల్సిన చాప్టర్, లెస్సెన్స్ లిస్టుని, ప్రెజెంటర్ పేరు, స్కూల్ వివరాలు ఉంచారు.  27 తేదీ నుంచి రికార్డింగ్ సెషన్లు జరుగుతున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు టీచర్లు లెస్సెన్స్​రికార్డ్ చేస్తున్నారు. వాటిని ఫ్యూచర్​లో పరిస్థితిని బట్టి టీ–శాట్, దూరదర్శన్ ద్వారా టెలికాస్ట్ చేస్తారు. మున్ముందు డిజిటల్ క్లాసులే ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
వారిపై స్పెషల్ ఫోకస్
ఓ వైపు క్లాసుల కోసం రికార్డింగ్ చేస్తూనే మరో వైపు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న నైన్త్, టెన్త్​పిల్లలపై మేనేజ్మెంట్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. గూగుల్ మీట్ ద్వారా పిల్లలకు రివిజన్ క్లాసులు చెబుతూ, వర్క్ షీట్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగా స్కూల్ మేనేజ్మెంట్లు పిల్లలకు ట్యాబ్​లు ప్రొవైడ్ చేశాయి. క్లాస్ టీచర్లు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి రోజువారీ షెడ్యూల్, టైమింగ్స్ ఇస్తున్నారు. 
డైలీ 2 గంటలు రివిజన్​ క్లాసులు
రెండేళ్ల నుంచి స్టూడెంట్స్​ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతున్నారు. దానివల్ల పిల్లలకు చాలా లాస్ ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు ఎగ్జామ్స్ పెడతారని తెలుస్తోంది. టెన్త్ పిల్లలను మెంటల్​గా స్ట్రాంగ్ చేస్తున్నాం. ప్రెజర్ ఫ్రీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పొడిగించిన హాలిడేస్ ను రివిజన్ కోసం ఉపయోగిస్తున్నాం. రోజుకు రెండు గంటలు ఆన్ లైన్​లో రివిజన్ క్లాసులు పెడుతున్నాం. దీనివల్ల పిల్లలకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతోంది. - శారద, హెచ్ఎం, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, మాసబ్ ట్యాంక్