ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్లు వీరే

V6 Velugu Posted on Oct 13, 2021

ఈ సీజన్ ఐపీఎల్  క్లైమాక్స్ కి చేరింది. ఎక్కువ రన్స్, ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్లు రికార్డులు సృష్టించారు. అయితే చెత్త రికార్డులను కూడా గుర్తించింది బీసీసీఐ. ఐపీఎల్‌ 2021 సీజన్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ బౌలర్లు ఆవేశ్‌ ఖాన్‌, మహ్మద్‌ సిరాజ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. ఈ సీజన్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన జాబితాలో ఇద్దరు టాప్ లో ఉన్నారు. ఆవేశ్‌ ఖాన్‌, సిరాజ్‌లు ఈ సీజన్‌ లో 147 డాట్‌ బాల్స్‌ వేయగా.. ఆ తర్వాత మహ్మద్‌ షమీ(పంజాబ్‌ కింగ్స్‌) 145 డాట్‌ బాల్స్‌తో రెండో స్థానంలో, 142 డాట్‌ బాల్స్‌తో బుమ్రా మూడోస్థానంలో, ట్రెంట్‌ బౌల్ట్‌ 138 డాట్‌ బాల్స్‌తో నాలుగో స్థానంలో, 137 డాట్‌ బాల్స్‌తో వరుణ్‌ చక్రవర్తి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇందులో ఆవేశ్‌ ఖాన్‌ ఇప్పటికే టాప్‌ పొజీషన్‌లో ఉండగా.. వరుణ్‌ చక్రవర్తి మినహా మిగతా బౌలర్లకు టాప్‌ స్థానానికి చేరుకునే అవకాశం లేదు. ఒకవేళ కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగనున్న క్వాలిఫయర్‌ 2లో ఓడిన టీమ్ ఇంటి బాట పట్టనుంది.  ఇప్పటికే సీఎస్‌కే ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
 

Tagged Mohammed Siraj, records, Bowlers, , Dot Balls, avesh khan, ipl -2021

Latest Videos

Subscribe Now

More News