రెడ్‌‌ భేండి, ఓక్రా, కుంకుమ్‌‌ భేండి.. అన్నీ ఒకటే

రెడ్‌‌ భేండి, ఓక్రా, కుంకుమ్‌‌ భేండి.. అన్నీ ఒకటే

త్వరగా పంట చేతికి రావడానికి, ఆహారంలో పోషక విలువలు పెంచడానికి కొత్త హైబ్రిడ్‌‌ వంగడాలను తీసుకొస్తుంటారు సైంటిస్ట్‌‌లు. అలానే ఇండియన్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ వెజిటబుల్‌‌ రీసెర్చ్‌‌, వారణాసి (ఐఐవిఆర్‌‌‌‌) సైంటిస్ట్‌‌లు కూడా ఒక కొత్త రకం బెండకాయ వంగడాన్ని సృష్టించారు. మామూలు బెండకాయ కంటే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్తున్నారు.

ఈ బెండకాయ ఎర్రగా ఉండటం వల్ల రెడ్‌‌ భేండి, ఓక్రా, కుంకుమ్‌‌ భేండి అని పిలుస్తున్నారు. కాశీ లాలిమ అనే ఇంకొక పేరు కూడా ఉంది దీనికి. యాంటీ ఆక్సిడెంట్స్‌‌, ఐరన్‌‌, కాల్షియం, విటమిన్– ఎ, బి 6 , సి, కె  లాంటి విటమిన్స్‌‌, న్యూట్రియెంట్స్ ఉన్న కారణంగా ఇది చాలారకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుందని చెప్తున్నారు సైంటిస్ట్‌‌లు. అవేంటంటే..

 

  • ఈ బెండకాయలో 94 శాతం పాలీ అన్‌‌శాచ్యురేటెడ్‌‌ ఫ్యాట్‌‌ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న 66 శాతం సోడియం అధిక బీపీని దూరం చేస్తుంది. 21 శాతం ఉండటం వల్ల ఐరన్ ఎనీమియా వచ్చే  అవకాశాన్ని తగ్గిస్తుంది. 5 శాతం ఉన్న ప్రొటీన్ మెటబాలిజంను కంట్రోల్‌‌ చేస్తుంది. 
  • ఈ సూపర్‌‌ ఫుడ్‌‌లో ఆంథోసైనిన్స్, ఫినోలిక్స్ లాంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌‌ఫ్లమేషన్‌‌ లక్షణాలను పెంచడానికి సాయపడతాయి. 
  • ఇందులో ఉండే ఫైబర్ డయాబెటిస్‌‌ను పోగొడుతుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు రావు. 
  • ‘మా 23 ఏండ్ల రీసెర్చ్‌‌కు ఇప్పుడు ఫలితం దొరికింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పంట, 40వ రోజునుంచే దిగుబడి ఇస్తుంది. ఈ బెండకాయలుం కిలో 100 రూపాయల నుంచి 500 రూపాయలు  ధర పలుకుతాయి. దీనివల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయి. రెండు ఎకరాలు సాగు చేస్తే దాదాపు 15 టన్నుల దిగుబడి ఇస్తున్న ఈ పంటను ఏ కాలంలో అయినా పండించొచ్చు’ అని చెప్తున్నాడు డాక్టర్‌‌‌‌. విజేంద్ర.