
ఎర్ర సముద్రంలో సముద్ర గర్భంలో ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అవ్వడంతో ఆదివారం ( సెప్టెంబర్ 7 ) ఆసియా సహా మధ్య పాశ్చ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ యాక్సెస్ ను పర్యవేక్షించే గ్లోబల్ వాచ్ డాగ్స్, ఎర్ర సముద్రంలో వరుస సబ్ సి కేబుల్ అంతరాయాల వల్ల ఇండియా, పాకిస్తాన్ సహా చాలా దేశాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో సౌత్ ఈస్ట్ ఏసియా, మిడిల్ ఈస్ట్ వెస్ట్రన్ యూరప్, ఇండియా మిడిల్ ఈస్ట్ వెస్ట్రన్ యూరప్ కేబుల్ సిస్టమ్స్ ప్రభావితం చేసే వైఫల్యాలను గుర్తిస్తాయి గ్లోబల్ వాచ్ డాగ్స్.
SMW4 ను టాటా గ్రూప్స్ లో భాగమైన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుండగా.. IMWE ఆల్కాటెల్ - లూసెంట్ పర్యవేక్షించే కన్సార్టియం నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ సేవల అంతరాయం గురించి ఈ రెండు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ తేలి కమ్యూనికేషన్స్ కంపెనీ లిమిటెడ్ మాత్రం ఇంటర్నెట్ సేవల అంతరాయం గురించి ఓ ప్రకటన విడుదల చేసింది.
యూఏఈలో కూడా ప్రభుత్వ యాజమాన్యంలోని డు అండ్ ఎటిసలాట్ నెట్వర్క్ యూజర్స్ కూడా ఇంటర్నెట్ స్పీడ్ పై కంప్లైంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సౌదీ అరేబియా అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.