హైదరాబాద్, వెలుగు: షావోమీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 12 సీ, రెడ్‌మీ నోట్12 లను నటి అనన్య నాగళ్ల సెల్‌బే గచ్చిబౌలి షోరూమ్‌లో గురువారం విడుదల చేశారు. స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్‌తో మొట్టమొదటిసారిగా రెడ్‌మీనోట్ 12 స్మార్ట్‌ఫోన్‌ను షావోమీ తెచ్చింది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ ఉండే రెడ్‌మీ 12సీ, డిజైన్ పరంగానూ ప్రత్యేకంగా కనిపిస్తోంది. షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా ఏప్రిల్ 6, 2023 నుంచి ఈ కొత్త మోడల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు మాట్లాడుతూ రెడ్‌మీ 12సీ 17 సెంటీమీటర్లు (6.71 అంగుళాలు) హెచ్‌డీ+ డిస్‌ప్లేతో కస్టమర్లకు మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందని చెప్పారు.
మెరుగైన ఆడియో కోసం సౌండ్ ఛాంబర్ ఉండటంతో పాటుగా ఎఫ్‌ఎం రేడియో, 3.5 మిల్లీ మీటర్ల జాక్ ఉన్నాయన్నారు. 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో , టచ్ చాలా వేగంగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని విధాలా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మెరుగైన అనుభవాలను అందిస్తుందని వివరించారు.సెల్‌బే డైరెక్టర్–స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ శ్రీ సుహాస్ నల్లచెరు మాట్లాడుతూ ‘‘రెడ్‌మీ 12సీ ప్రారంభ ధర 4జీబీ+64జీబీ వేరియంట్ రూ. 8999 , 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 10,999 గా వెల్లడించారు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు కలిగిన వారు అదనంగా రూ. 500 తగ్గింపు పొందవచ్చని చెప్పారు. అలాగే రెడ్ మీ నోట్ ప్రారంభ ధర రూ. 14,999 కాగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 1,000 రూపాయల తగ్గింపు లభిస్తుందని అన్నారు.
షావోమి కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్ ప్రోగ్రామ్‌లో సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ సోమా నాగరాజు , సెల్‌బే డైరెక్టర్–స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ సుహాస్ నల్లచెరు, సెల్‌బే వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, షావోమీ ఇండియా ఆఫ్‌లైన్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జునరావు , షావోమీ ఇండియా ఓటీ లీడ్ సజ్జు రత్నం , షావోమీ ఏపీ – తెలంగాణా ఓటీ లీడ్ సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
