Redmi 13C 5G రివ్యూ: అదుర్స్..AI పవర్డ్ డ్యుయెల్ కెమెరాతో బడ్జెట్ స్మార్ట్ఫోన్

Redmi 13C 5G రివ్యూ: అదుర్స్..AI పవర్డ్ డ్యుయెల్ కెమెరాతో బడ్జెట్ స్మార్ట్ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi  ఇటీవల Redmi 13 C 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.  5G  కనెక్టివిటీతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారుల కోసం Redmi 13 C 5G ని మార్కెట్లో విక్రయిస్తోంది. బడ్జెట్ 5G సెగ్మెంట్ లో స్టార్ ట్రైల్ సిల్వర్ కలర్ లో 8GB+ 256 GB స్టోరేజ్ తో ఈ డివైజ్ ను రూ.14,499 లకు విక్రయిస్తోంది. ఈ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులు చాలా బాగుంది ముఖ్యంగా ఇందులో AI పవర్డ్ డ్యుయెల్ కెమెరా అద్బుతంగా ఉందంటున్నారు. Redmi 13 C 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, డిజైన్, బిల్ట్, డిస్ ప్లే,కెమెరా పనితీరు, బ్యాటరీ గురించి ఒకసారి చూద్దాం.. 

Redmi 13 C 5G  స్మార్ట్ ఫోన్..ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధరలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్ బిల్డ్, రౌండెడ్ కార్నర్స్, వెనక ప్యానెల్ లో మెరిసే గాజులా నిర్మాణంలో ఆకర్షణీయంగా ఉంది.

డిస్ ప్లే.. 20:9 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిప్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.74 అంగుళాల HD+ డిస్ ప్లే తో Redmi 13 C మంచి విజువల్స్ ను అందిస్తుంది. గేమింగ్, మూవీ చూడటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. 

కెమెరా పనితీరు.. 50MP AI పవర్డ్ డ్యుయెల్ కెమెరా సెటప్ తో Redmi 13C ప్రత్యేకమైన మాక్రో లెన్స్ లేనప్పటికీ మంచి షాట్ లను క్యాప్చర్ చేస్తుంది. Media Tek డైమెన్సిటీ 6100+5G చిప్ సెట్, హీటింగ్ సమస్యలు లేవు, గేమింగ్ సెషన్లలో మంచి పనితీరును అందిస్తుంది. 

ఆండ్రాయిడ్ ఆధారిత MIUI14 స్క్రీన్, ముందు గా ఇన్ స్టాల్ చేసిన యాప్ లతో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. 

బ్యాటరీ .. 5000mAh బ్యాటరీతో Redmi 13C రెండు రోజుల పాటు ఛార్జింగ్ ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, 10 W చార్జర్ తో త్వరగా రీఫిల్ చేయబడుతుంది. 

5G మార్కెట్లో సరసమైన ధరల్లో కోరుకునే వినియోగదారులకు Redmi 13C మంచి ఎంపిక.ఆకర్షణీయమైన డిజైన్, మంచి బ్యాటరీ లైఫ్, సంతృప్తి కరమైన పనితీరుతో ఇది 5G మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న మొబైల్. తక్కువ కాంతిలో కూడా మంచి క్యాప్చరింగ్ తో కెమెరా పనితీరు అద్భుతంగా ఉంటుంది. మంచి ఫీచర్లతో కూడిన బడ్జెట్ 5G అప్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్ గా Redmi 13 C ని ఎంపిక చేసుకోవచ్చు..