
షావోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మీ బడ్జెట్ ఫోన్ 13సీ 5జీని వచ్చే నెల 6 న లాంచ్ చేయనుంది. ధర రూ.10 వేల దగ్గర ఉండొచ్చని అంచనా. బ్లాక్, గ్రీన్ రెండు కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా దీని సొంతం. 4జీబీ+ 64 జీబీ, 6జీబీ+128 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ దొరుకుతుంది.