వీటిని రెగ్యులర్​ డైట్​లో చేర్చితే చర్మానికి మంచిది

వీటిని రెగ్యులర్​ డైట్​లో చేర్చితే చర్మానికి మంచిది

పొల్యూషన్​ , సన్​ డ్యామేజ్​, అన్​ హెల్దీ లైఫ్​ స్టైల్​ వల్ల చర్మానికొచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. వీటివల్ల యాక్నె, ముడతలు, వైట్​ హెడ్స్  లాంటి ప్రాబ్లమ్స్​ ఎన్నో  వస్తాయి. వీటన్నింటికీ సొల్యూషన్​ కడుపునిండా తినడమే.. అయితే ఆ తిండిలో ప్రొటీన్స్​, విటమిన్స్​, మినరల్స్​ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. అలా స్కిన్​ని డ్యామేజ్​ నుంచి రిపేర్​ చేసే సూపర్​ ఫుడ్స్​ ఇవి. వీటిని రెగ్యులర్​ డైట్​లో చేర్చితే చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ఫుడ్​ టెక్​ సైంటిస్ట్​ కె. పవిత్ర. 

హెల్దీ అండ్​ గ్లోయింగ్​ స్కిన్​ కోసం మార్కెట్​లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ, అవన్నీ చాలావరకు కెమికల్స్​తో నిండినవే. నేచురల్​ పేరుతో వచ్చే ప్రొడక్ట్స్​లోనూ రంగు కోసమో, టెక్స్చర్​ కోసమో ఎంతో కొంత కెమికల్​ కలుపుతారు. ఇవన్నీ ఇలా ఉంచితే ఆ ప్రొడక్ట్స్​ మంచి రిజల్ట్స్​ ఇచ్చినప్పటికీ అది కొంతకాలమే. ఆ క్రీములు, లోషన్లకి బ్రేక్ ఇస్తే మళ్లీ స్కిన్​ డల్​ అవుతుంది. అందుకే నేచురల్​గా స్కిన్​ని రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ ఫుడ్​ తినాలి. 

  • గుడ్డులో స్కిన్​ని హెల్దీగా మార్చే నూట్రియెంట్స్​ ఉంటాయి. వీటిల్లోని లుటైన్​​, వైట్​ మల్టీ విటమిన్స్​ స్కిన్​ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. ప్రొటీన్స్ చర్మ కణాల్ని రిపేర్​ చేస్తాయి. అయితే గుడ్లని ఎలా తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. గుడ్లని ఉడకబెట్టి లేదా సలాడ్​, ఆమ్లెట్​గా తినాలి. గుడ్డు పచ్చసొన వల్ల చర్మం పాడవుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, అందులోని ఫ్యాటీ యాసిడ్స్​ చర్మాన్ని మాయిశ్చరైజ్​ చేసి, గ్లో ఇస్తాయి. 
  • విటమిన్–​ సి, ఇ ఎక్కువగా ఉండే అవకాడో చర్మానికి చాలా మేలు చేస్తుంది.  వీటిల్లో ఉండే విటమిన్స్​, ఫ్యాట్స్​ వల్ల యాక్నె,  తామర లాంటి సమస్యలు  దూరమవుతాయి.  చర్మంపై ముడతల్ని తగ్గిస్తాయి. స్కిన్​ డ్యామేజ్, ఇన్​ఫ్లమేషన్​తో పాటు స్కిన్​ క్యాన్సర్​ నుంచి బయటపడేస్తాయి. అవకాడోలో  బి– కాంప్లెక్స్​ విటమిన్స్​లో ఒకటైన  బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది డ్రై స్కిన్​ నుంచి కాపాడుతుంది. అలాగే జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి కూడా అవకాడో చాలా మంచిది.
  • విటమిన్​– బి, యాంటీ ఆక్సిడెంట్స్​తో నిండిన వాల్​నట్స్​ అయితే  సూర్య కిరణాలు, దుమ్ము, ధూళి నుంచి చర్మాన్ని కాపాడతాయి. ప్రి మెచ్యూర్​ ఏజింగ్​ అంటే చిన్న వయసులోనే ముఖంపై వచ్చే ముడతల్ని రానీయవు. వీటిల్లోని విటమిన్​– ఇ స్కిన్​ని హైడ్రేటెడ్​గా ఉంచడంతో పాటు కొల్లాజెన్​ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో వయసు ఛాయలు కనిపించవు. డార్క్​ సర్కిల్స్​, చుండ్రు సమస్యల్ని నుంచి కూడా రిలీఫ్​ ఇస్తుంది అవకాడో. 
  • డార్క్​ స్పాట్స్​ నుంచి తప్పించుకోవాలంటే బాదం తినాల్సిందే. వీటిల్లోని విటమిన్​ –ఇ  యాంటీ ఆక్సిడెంట్​ ప్రాపర్టీగా పనిచేస్తుంది. దానివల్ల ఏజింగ్​కి దారితీసే ఫ్రీ ర్యాడికల్స్​ బ్లాక్​ అయి యాక్నె సమస్యలు రావు. అలాగే వీటిల్లోని విటమిన్స్​ చర్మానికి సరిపడా తేమ, గాలి అందడానికి సాయం చేస్తాయి. దానివల్ల డార్క్​ సర్కిల్స్​తో పాటు కళ్ల ఉబ్బు కూడా తగ్గుతుంది. వీటిల్లోని ఫ్యాటీ యాసిడ్స్​ శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. దానివల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, అందంగా  పెరుగుతుంది. 
  • జీడిపప్పులోనూ విటమిన్​– ఇ తో పాటు జింక్, సెలీనియం ఎక్కువగా  ఉంటాయి. ఇవి స్కిన్​ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయి. వివిధ కారణాల వల్ల డ్యామేజ్​ అయిన స్కిన్​ని రిపేర్​ చేస్తాయి.  అలాగే పిస్తాలోని యాంటీ ఆక్సిడెంట్స్​ యాక్నెని కంట్రోల్​ చేస్తాయి. ఆయిల్​ స్కిన్​ని దూరం చేస్తాయి. అందుకే జిడిపప్పు, పిస్తా తినాలి.
  •  చాక్లెట్స్​లో ఉండే షుగర్​ కంటెంట్​ , డైరీ ప్రొడక్ట్స్​ వల్ల యాక్నె సమస్యలొస్తాయన్న మాట నిజమే. కానీ, వీటిని రెగ్యులర్​గా తింటేనే ఆ ఇబ్బందులు. ఇవన్నీ పక్కనపెడితే స్కిన్​ని హెల్దీగా మార్చే చాక్లెట్స్​ కూడా ఉన్నాయి. వాటిల్లో డార్క్​ చాక్లెట్​గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటి తయారీలో 70 నుంచి 85శాతం కోకో పౌడర్​ ఉంటుంది. వాటిలోని కాపర్​, జింక్​, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్​, పొటాషియం, ఫాస్పరస్​, సెలీనియం ​ డెడ్​ స్కిన్​ సెల్స్​ని తొలగిస్తాయి. ఈ చాక్లెట్స్ తినడం వల్ల సన్​ డ్యామేజ్​ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా చర్మానికి స్పూత్​ టెక్స్చర్​ని ఇస్తాయి ఇవి.