గుజరాత్ విజయాల గురించి చెప్పడం లేదు: బీవీ రాఘవులు

గుజరాత్ విజయాల గురించి చెప్పడం లేదు: బీవీ రాఘవులు

గుజరాత్ లో అభివృద్ధి చేసి ఓటు వేయాలని ప్రచారం చేయకుండా.. మతాన్ని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. గుజరాత్ లో సాధించిన విజయాలు, సాధించబోయే విజయాల గురించి చెప్పడం లేదని ఆయన విమర్శించారు.

జీ 20 సమావేశం పూర్తిగా విఫలమైందని.. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం జీ 20 సమావేశంలో విజయాలు సాధించినట్లు  ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. సంపన్న దేశాలు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల మన దేశం ఇబ్బంది పడుతుందన్నారు. పర్యావరణ సదస్సులోనూ భారత దేశం సంపన్న  దేశాలపై ఒత్తిడి తేవడంలో విఫలం అయిందన్నారు. 
దేశంలో ప్రాంతీయ పార్టీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని చులకన చేసి మాట్లాడడం బాధాకరం అన్నారు. ప్రాంతీయ పార్టీలకు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టే హక్కు ఉందని బీవీ రాఘవులు స్పష్టం చేశారు. 

పోడు భూములకు పట్టాలు ఇస్తామనడం సంతోషకరం: తమ్మినేని వీరభద్రం

రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల నుండి పోడు భూములకు పట్టాలు ఇస్తామనడం సంతోషకరం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు సీపీఎం పార్టీ పెట్టిన 20 డిమాండ్లలో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో రైతుల నుండి లాక్కుని చెట్లు నాటిన పోడు భూములను కూడా సర్వే చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కనీస వేతనాల సవరణ కు సంబంధించి వెంటనే అమలు చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుల యూనియన్స్ లేకుండా చేశారని.. వాటిని వెంటనే అమలు చేయాలన్నారు. డీఎస్సీ 1998, డీఎస్సీ2008 లలో ఎంపికైన వారికి వెంటనే భర్తీ చేయాలన్నారు. ధరణికి సంబంధించి దాదాపు పది లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని...వీటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే సమస్యలు పరిష్కరించాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. 
బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, బీజేపీకి వ్యతిరేకంగా నిరసన నిర్వహిస్తే అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం పోలీసులతో సీపీఎం కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇది ఇది సరైంది కాదన్నారు. మా పార్టీలో టీఆర్ ఎస్ తో ఎన్నికల పొత్తు గురించి మాట్లాడలేదని, అవన్నీ ఊహాగానాలేనని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.