పెండ్లి భోజనం సరిపోలేదని.. తలలు పగిలిపోయేలా కొట్టుకున్నారు

పెండ్లి భోజనం సరిపోలేదని.. తలలు పగిలిపోయేలా కొట్టుకున్నారు

పెండ్లి భోజనం సరిపోలేదని తలలు పగిలిపోయేలా కొట్టుకున్నారు పెళ్లికి వచ్చిన అతిథులు. జగిత్యాల జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట పెండ్లి భోజనం సరిపోలేదని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా తలలు పగిలేలా కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో 2024 మార్చి 20 బుధవారం పెళ్లి జరిగింది. ఆ తర్వాత అందరూ భోజనం చేయడానికి వెళ్లారు. అయితే ఈ క్రమంలో పెళ్లికి బంధు, మిత్రులు వస్తారని ఒక అంచనా ప్రకారం.. వంట చేయించారు వధువు తరుపువాళ్లు. కానీ వారి ఊహకు మించిన బంధుమిత్రులు వచ్చారు. దీంతో కొంతమంది భోజనం చేశారు.. మరి కొంతమంది చేయలేదు... ఇంకొందరికి భోజనం సరిపోలేదు. ఇలా సగం సగం ఎందుకు భోజనం ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు వేములవాడకు చెందిన వరుడి తరపున బంధువులు. 

దీంతో పెళ్లికొడుకు బంధువులకు, పెళ్లికూతురు బంధువులతో వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ కాస్త ముదిరి.. ఒకరిని ఒకరు కొట్టుకోవడం వరకు వచ్చింది. ఈ గొడవలో కొందరి తలలకు గాయాలయ్యాయి. వారి మధ్య వధువు గ్రామస్తులు కూడా జ్యోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాల వారికి ఎంత చెప్పినా గొడవ మాత్రం సద్దుమణగడం లేదు. దీంతో బంధువులను ఊరి నుంచి బయటకు వెళ్లకుండా బస్సులను ఆపేశారు గ్రామస్తులు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. పెళ్లి బస్సులను పంపించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.