'యశోద' రిలీజ్ డేట్ వచ్చేసింది

'యశోద' రిలీజ్ డేట్ వచ్చేసింది

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సస్పెన్స్ కు తెరదించుతూ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. పాన్ ఇండియా రేంజ్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినీ థియేటర్లలో సందడి చేయబోతోంది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. సమంత రోల్ ను డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న లుక్స్ తో డిజైన్ చేశారు. ఇప్పటివరకు చూసుకుంటే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్ని సినిమాల్లోనూ.. డిఫరెంట్ గానే కనిపించింది. ప్రతి సినిమాలోనూ కొత్త యాంగిల్ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

కథ, కథనం, నిర్మాణం విలువల్లోనే కాకుండా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా భిన్నంగా వెళుతోంది ఈ మూవీ యూనిట్. విడుదల తేదీ పోస్టర్ ని అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక యశోద తాజా పోస్టర్.. సినిమా పై ప్రేక్షకుల్లో యాంగ్జైటీని మరింత పెంచేసింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమాని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. 

ఇది ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని.. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు కాని ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయని చిత్ర నిర్మాత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసం సమంత ట్రైనింగ్ కూడా తీసుకున్నారని చెప్పారు. తెలుగు, తమిళ బాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారని తెలిపారు. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుందన్న ఆయన.. ఖర్చుకు వెనకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో దీన్ని పూర్తి చేశామని చెప్పారు.