రెండేళ్ల బకాయిలు విడుదల చేయండి

V6 Velugu Posted on Jan 24, 2022

  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు హరీష్ రావు లేఖ

హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ రాశారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బకాయి 900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందన్నారు. ఆ గ్రాంట్లు విడుదల చేసి మరో ఐదేళ్లు పొడిగించాలని కోరారు హరీశ్ రావు.

నీతి ఆయోగ్ సూచించిన 24 వేల 205 కోట్లు రిలీజ్ చేయాలన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం స్థానిక సంస్థలకు 817 వందల 61 కోట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని... 723 కోట్లతో ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సు సూచనల మేరకు వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. కేంద్రప్రాయోజిత పథకాలల్లో భాగంగా కేంద్రం వాటాను 2014-15లో ఏపీకి విడుదల చేశారన్నారు హరీశ్ రావు.  ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన 495 కోట్ల 20 లక్షలను వెంటనే ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న IGST నిధులు 210 కోట్ల ను మంజూరు చేయాలని కోరారు మంత్రి హరీశ్ రావు.

 

ఇవి కూడా చదవండి

మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలి

కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

 

Tagged Telangana, Minister, Nirmala Sitharaman, Letter, Harish rao, pending arrears, Union Finance Minister

Latest Videos

Subscribe Now

More News