
‘కార్తికేయ2’ చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకున్న నిఖిల్.. ఇప్పుడు ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గూఢచారి, ఎవరు, హిట్ లాంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అఫీషియల్ లీక్’ పేరుతో సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు నిఖిల్ ట్వీట్ చేశాడు.
మాసివ్, మల్టీ లాంగ్వేజ్, నేషనల్ థ్రిల్లర్ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచాడు నిఖిల్. అభినవ్ గోమటం, సాన్య ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.