హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్/జియోమార్ట్ ఈ నెల 2 నుంచి 17 వరకు డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. చాలా ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఇస్తోంది. www.reliancedigital.in లేదా www.jiomart.com ద్వారా ప్రొడక్టులను ఆర్డర్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్స్‌పై బెస్ట్ డీల్స్ ఇవ్వడంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ఇస్తారు. అదనంగా రూ.రెండు వేల విలువైన కూపన్స్ ఇస్తారు. రూ. 80 వేల కంటే ఎక్కువ కొంటే రూ.10 వేల వరకు అదనపు డిస్కౌంట్ ఇస్తారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉంటాయి. ఈఎంఐ పద్ధతిలోనూ ప్రొడక్టులను కొనుక్కోవచ్చు. సరికొత్త శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22+ గ్రీన్ కలర్ వేరియంట్ ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 84,999. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 61,900. వీటిపై క్యాష్‌బ్యాక్, స్టోర్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వస్తాయి కాబట్టి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. 12వ జెనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో వచ్చిన హెచ్‌పీ ల్యాప్‌టాప్‌పై రూ.6 వేల విలువైన ఆఫర్లు ఉన్నాయి.
