ఫార్చ్యూన్‌‌ లిస్టులో రిలయన్స్ డౌన్‌‌

V6 Velugu Posted on Aug 04, 2021


59 ప్లేస్‌‌లు తగ్గి 155 వ పొజిషన్‌‌కు 
న్యూఢిల్లీ:ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్  ఇండస్ట్రీస్ ఫార్చ్యూన్ లిస్ట్‌‌లో 59 ప్లేస్‌‌లు కిందకు పడింది. రెవెన్యూని బట్టి గ్లోబల్‌‌ టాప్‌‌ 500 కంపెనీల లిస్ట్‌‌ను ఫార్చ్యూన్‌‌ రిలీజ్ చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ( మార్చి 3 1 లేదా అంతకంటే ముందు) కంపెనీలకు వచ్చే రెవెన్యూని బట్టి ఈ లిస్ట్‌‌ను విడుదల చేస్తోంది. ఈ లిస్ట్‌‌లో రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ 155 స్థానానికి పడిపోయింది. 2020–21 ఆర్థిక సంవత్సరం సెకెండ్ క్వార్టర్‌‌‌‌లో క్రూడాయిల్‌‌ ధరలు పడిపోయాయి. దీని ప్రభావం కంపెనీ ఏడాది రెవెన్యూపై పడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ రెవెన్యూ 25.3 శాతం తగ్గి 63 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2017 తర్వాత రిలయన్స్‌‌కు ఇదే తక్కువ ర్యాంకు. ఇతర ఇండియన్ ఆయిల్ కంపెనీలు కూడా ఫార్చ్యూన్ లిస్ట్‌‌లో కిందకు పడ్డాయి. ఇండియన్‌  ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌ (ఐఓసీ) 61 ప్లేస్‌‌లు (రెవెన్యూ 50 బిలియన్ డాలర్లు) కిందకు పడి 212 కి, ఓఎన్‌‌జీసీ ర్యాంక్ 53 ప్లేస్‌‌లు (రెవెన్యూ 46 బిలియన్ డాలర్లు) తగ్గి 243 కి పడింది.  ఫార్చ్యూన్‌‌ లిస్ట్‌‌లో  టాటా మోటార్స్ ర్యాంకింగ్‌‌ 20 ప్లేస్‌‌లు తగ్గి 357 కి, భారత్‌‌ పెట్రోలియం ర్యాంక్‌‌ 309 నుంచి 394 కు తగ్గింది. స్టేట్‌‌ బ్యాంక్ ర్యాంక్  16 ప్లేస్‌‌లు (రెవెన్యూ 52 బిలియన్ డాలర్లు) మెరుగుపడి  205 కి చేరుకుంది. రాజేష్ ఎక్స్‌‌పోర్ట్స్ ర్యాంక్ 114 ప్లేస్‌‌లు (రెవెన్యూ  35 బిలియన్ డాలర్లు) మెరుగుపడి 348 ర్యాంకుకి చేరుకుంది. 
మళ్లీ వాల్‌‌మార్టే..
గ్లోబల్‌‌ ఫార్చ్యూన్‌‌ లిస్టులో వరసగా ఎనిమిదో సారి కూడా వాల్‌‌మార్టే నెంబర్ వన్‌‌ పొజిషన్‌‌లో నిలిచింది. కంపెనీ రెవెన్యూ 524 బిలియన్ డాలర్లు కాగా, సెకెండ్ పొజిషన్‌‌లో ఉన్న చైనా స్టేట్ గ్రిడ్‌‌ రెవెన్యూ  384 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీల రెవెన్యూల మధ్య చాలా గ్యాప్ ఉంది. 1995 నుంచి చూస్తే వాల్‌‌మార్ట్‌‌ 16 సార్లు నెంబర్ వన్ పొజిషన్‌‌లో నిలిచింది. 280 బిలియన్ డాలర్ల రెవెన్యూతో అమెజాన్‌‌ మూడో ప్లేస్‌‌లో, చైనా నేషనల్ పెట్రోలియం నాల్గో ప్లేస్‌‌లో, సినోపెక్‌‌ గ్రూప్‌‌ ఐదో ప్లేస్‌‌లో నిలిచాయి.  ‌‌ఫార్చ్యూన్‌‌ 500 లిస్టులో ఎక్కువ కంపెనీలు (135 కంపెనీలు) మెయిన్‌‌ల్యాండ్ చైనా (హాంకాంగ్‌‌ కలిపి) నుంచే ఉన్నాయి. తైవాన్‌‌ను కూడా కలుపుకుంటే  గ్రేటర్‌‌‌‌ చైనా నుంచి 143 కంపెనీలు ఈ లిస్టులో చోటు సంపాదించాయి. 122 కంపెనీలతో యూఎస్‌‌ తర్వాతి స్థానంలో ఉంది. మొత్తం వరల్డ్ జీడీపీలో మూడో వంతు జీడీపీని ఈ 500 కంపెనీలు జనరేట్ చేస్తున్నాయని  ఫార్చ్యూన్ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు 31.7 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూని, 1.6 ట్రిలియన్ డాలర్ల ప్రాఫిట్‌‌ను జనరేట్ చేశాయని తెలిపింది. మొత్తం 6.97 కోట్ల మందికి ఉపాధి కలిపిస్తున్నాయని పేర్కొంది. కాగా, ఫార్చ్యూన్‌‌ లిస్ట్‌‌లో ఎక్కువ ప్రాఫిట్ సంపాదించిన కంపెనీగా యాపిల్‌‌ నిలిచింది. తర్వాత సౌదీ ఆరామ్‌‌కో ఉంది.

Tagged business, Reliance, down, , Fortune list

Latest Videos

Subscribe Now

More News