
న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో డైరెక్టర్ పొజిషన్ నుంచి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తప్పుకున్నారు. మార్కెట్‌లో లిస్టింగ్ అయిన కంపెనీల్లో అనిల్ అంబానీకి ఎటువంటి పొజిషన్ ఉండకూడదని తాజాగా సెబీ ఆర్డర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రిలయన్స్ పవర్ బోర్డు నుంచి అనిల్ అంబానీ తప్పుకున్నారు. సెబీ ఇంటిరిమ్ ఆర్డర్స్‌కు అనుగుణంగా తమ కంపెనీ బోర్డు నుంచి అనిల్ అంబానీ తప్పుకున్నారని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి డబ్బును విదేశాలకు ఎగవేస్తున్నారని ఆరోపణలపై అనిల్ అంబానీని మార్కెట్ల నుంచి సెబీ బ్యాన్ చేసింది.