జియోకి రూ.20 వేల కోట్లు

జియోకి రూ.20 వేల కోట్లు

టెలికాం ఇండస్ట్రీలో రిలయన్స్ జియో పేరు తెలియని వారుండరు. ఇప్పుడు ఈ కంపెనీ కన్ను ఈకామర్స్, బ్రాడ్‌‌బ్యాండ్, 5జీ సర్వీసులపై పడింది. వీటిలో కూడా సంచలనాలకు తెరలేపుతూ.. మార్కెట్‌‌లోకి ఎంటర్‌‌‌‌ కావడానికి రిలయన్స్ జియోకి దాని పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌‌‌‌ఐఎల్) భారీగా పెట్టుబడులు అందించనుంది. ఈ భారీ విస్తరణకు అవసరమయ్యే క్యాపిటల్‌‌ను సమకూర్చనుంది.  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీ రూ.20 వేల కోట్ల క్యాపిటల్‌‌ను పెట్టుబడిగా పెట్టబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  బ్రాడ్‌‌బ్యాండ్, ఈకామర్స్ వ్యాపారం, 5జీ సర్వీసుల్లోకి ఎంటర్‌‌‌‌ కావడానికి రిలయన్స్ జియోకి ఈ నగదును అందిస్తున్నట్టు పేర్కొన్నాయి. రిలయన్స్ జియో దాని పేరెంట్ కంపెనీకి 400 కోట్ల నాన్ క్యూములేటివ్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను జారీ చేయబోతుందని తెలిసింది. ఒక్కో షేరు ధర రూ.50గా నిర్ణయిస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ షేర్ల జారీ అంతా నగదులోనే ఉండనుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.

‘ఈ క్యాపిటల్ రిలయన్స్ జియో మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. నాన్ క్యుములేటివ్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లపై 9 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ విషయంపై రిలయన్స్ జియో ఇంకా స్పందించలేదు. ఇన్‌‌ఫ్రాక్ట్చ్రర్‌‌‌‌ అప్‌‌గ్రేడేషన్‌‌ స్థిరంగా కొనసాగడం, 5జీ విస్తరణతో టెలికాం రంగానికి  మూలధన అవసరాలు అత్యధికంగానే ఉంటున్నాయని దేశీయ బ్రోకరేజ్‌‌కు చెందిన ఓ అనలిస్ట్ చెప్పారు. ఇండియాలో కనీస సదుపాయాలు అందని ఇళ్లకి,  ఎంటర్‌‌‌‌ప్రైజ్ కనెక్టివిటీ మార్కెట్‌‌ను చేరుకోవాలని ప్రస్తుతం జియో లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గిగాఫైబర్ ఫిక్స్‌‌డ్ బ్రాడ్‌‌బ్యాండ్‌‌తో పాటు మొబిలిటీ సర్వీసులపై ఎక్కువగా ఫోకస్ చేసిందన్నారు. జియో పెట్టుబడులను కొనసాగిస్తుందన్నారు.

 ఆర్‌‌‌‌ఐఎల్ అప్పులు రూ.2.87 ట్రిలియన్లు…

మార్చి 31 నాటికి, ఆర్‌‌‌‌ఐఎల్ అప్పులు రూ.2.87 ట్రిలియన్లకు పైగా ఉన్నాయి. జియోలో పెట్టిన పెట్టుబడులతో ఈ అప్పులు రూ.69 వేల కోట్లు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్‌‌‌‌ఐఎల్ క్యాష్ రిజర్వ్‌‌లు రూ.1.33 ట్రిలియన్లుగా ఉన్నాయి. రుణాలను తగ్గించుకోవడానికి జియో తన ఫైబర్, టవర్ సంస్థలను రెండు ఇన్‌‌ఫ్రాక్ట్చ్రర్ ట్రస్ట్‌‌లు డిజిటల్ ఫైబర్ ఇన్‌‌ఫ్రాక్ట్చ్రర్ ట్రస్ట్, టవర్ ఇన్‌‌ఫ్రాక్ట్చ్రర్ ట్రస్ట్‌‌లకు బదిలీ చేసింది. ఈ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌తో కేవలం అప్పులను తగ్గించుకోవడమే కాకుండా…  అసెట్ లైట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీగా అవతరించింది.

దాదాపు 31 కోట్లమంది యూజర్లు..

మూడేళ్ల కంటే తక్కువ వయసున్న రిలయన్స్ జియో 30.67 కోట్ల సబ్‌‌స్క్రయిబర్లను సొంతం చేసుకుంది. మార్చి 2019 నాటికి రెవెన్యూ మార్కెట్ షేరును 31.7 శాతానికి పెంచుకుంది. వొడాఫోన్ ఐడియా రెవెన్యూ మార్కెట్ షేరు ప్రస్తుతం 32.2 శాతంగా, ఎయిర్‌‌‌‌టెల్ రెవెAన్యూ మార్కెట్ షేరు 27.3 శాతంగా ఉంది. జియో నికర లాభం 2018–19లో నాలిగింతలు పైగా పెరిగి రూ.2,964 కోట్లుగా నమోదైంది. 2017–18లో ఇది రూ.723 కోట్లుగానే ఉంది. 2018–19 మార్చి క్వార్టర్‌‌‌‌లో ఆపరేషన్స్ నుంచి వచ్చిన స్టాండలోన్ రెవెన్యూ 7 శాతం పెరిగి రూ.11,109 కోట్లుగా రికార్డైంది. ఇది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.10,383 కోట్లుగా ఉంది.