రిలయన్స్ అదుర్స్‌‌‌‌..క్యూ1లో కంపెనీ నికర లాభం 76 శాతం అప్‌‌‌‌

రిలయన్స్ అదుర్స్‌‌‌‌..క్యూ1లో కంపెనీ నికర లాభం 76 శాతం అప్‌‌‌‌
  • ఏషియన్ పెయింట్స్‌‌‌‌లో వాటా అమ్మకంతో రూ.30,783 కోట్లకు పెరిగిన ప్రాఫిట్‌‌‌‌
  • రెవెన్యూ రూ.2.73 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌) ఈ ఏడాది జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో రూ.30,783 కోట్ల నికర లాభాన్ని సాధించింది.  కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన లాభంతో పోలిస్తే ఇది 76శాతం ఎక్కువ.  

ఏషియన్ పెయింట్స్‌‌‌‌లో  వాటాను అమ్మడం ద్వారా రూ.8,924 కోట్ల వన్‌‌‌‌టైమ్‌‌‌‌ ప్రాఫిట్ వచ్చింది.   దీనిని మినహాయిస్తే కంపెనీ నెట్  ప్రాఫిట్‌‌‌‌  25 శాతం పెరిగింది.  రిటైల్‌‌‌‌, టెలికం బిజినెస్‌‌‌‌లు మంచి పనితీరు కనబరిచాయి. కంపెనీ    కన్సాలిడేటెడ్ రెవెన్యూ క్యూ1 లో 6శాతం పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరుకుంది.  ఆపరేటింగ్ లాభం (ఇబిటా) 36శాతం పెరిగి రూ.58,024 కోట్లుగా నమోదైంది. 

రిటైల్‌‌‌‌ రెవెన్యూ రూ.84 వేల కోట్ల పైనే

రిలయన్స్ రిటైల్ రెవెన్యూ క్యూ1 లో ఏడాది లెక్కన 11.3శాతం పెరిగి రూ.84,171 కోట్లకు,  ఇబిటా 12.7శాతం పెరిగి రూ.6,381 కోట్లకు చేరింది. ఎఫ్ఎంసీజీ బిజినెస్ సెగ్మెంట్‌‌‌‌లో రూ.11,450 కోట్ల సేల్స్ సాధించడం విశేషం. ఈ కంపెనీ క్యూ1 లో 388 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,592 కి చేరింది. 

రిలయన్స్ చేతికి కెల్వినేటర్ బ్రాండ్ 

ఎలక్ట్రోలక్స్ గ్రూప్‌‌‌‌కు చెందిన కెల్వినేటర్ బ్రాండ్‌‌‌‌ను సుమారు రూ.160 కోట్లకు కొనుగోలు చేశామని రిలయన్స్ రిటైల్ ప్రకటించింది.  కెల్వినేటర్ ఇండియాలో  రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషీన్లను అమ్ముతోంది. 

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఐపీఎల్ బూస్ట్..

జియోస్టార్ (మీడియా అండ్‌‌‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్) రెవెన్యూ  క్యూ1 లో రూ.9,904 కోట్లుగా, ఇబిటా రూ.1,017 కోట్లుగా నమోదైంది. బ్లాక్‌‌‌‌బస్టర్ ఐపీఎల్‌‌‌‌ సీజన్‌‌‌‌తో జియోహాట్‌‌‌‌స్టార్ యాప్ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌లు 100 కోట్లను దాటాయి. వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్ 119 కోట్లకు, నెలవారీ యాక్టివ్ యూజర్లు 46 కోట్లకు పెరిగారు. 

ఓ2సీ రెవెన్యూ పడినా లాభం పైకే

ఆయిల్- టు- కెమికల్స్ (ఓ2సీ ) సెగ్మెంట్‌‌‌‌ రెవెన్యూ క్యూ1 లో ఏడాది లెక్కన1.5శాతం తగ్గి రూ.1.55 లక్షల కోట్లకు పడింది.  కానీ ఇబిటా మాత్రం 11శాతం పెరిగి రూ.14,511 కోట్లకు చేరుకుంది. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌లో రిటైల్ మార్జిన్‌‌‌‌లు మెరుగుపడ్డాయని కంపెనీ పేర్కొంది.  

రిలయన్స్ బీపీ మొబిలిటీ ఔట్‌‌‌‌లెట్ల సంఖ్య1,991 కి పెరిగింది.  ఆయిల్ అండ్  గ్యాస్ రెవెన్యూ 1.2శాతం తగ్గి రూ.6,103 కోట్లకు, ఇబిటా 4.1శాతం తగ్గి రూ.4,996 కోట్లకు పడింది.  కేజీ డీ6 లో ఉత్పత్తి తగ్గడం, గ్యాస్ ధరలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.29,887 కోట్లను క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్ కింద ఖర్చు చేసింది.

జియో కస్టమర్లు సుమారు 50 కోట్లు

జియో ప్లాట్‌‌‌‌ఫామ్స్ నికర లాభం క్యూ1 లో 25 వృద్ధి చెంది రూ.7,110 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌లు, వడ్డీలకు ముందు ప్రాఫిట్‌‌‌‌) 24 శాతం పెరిగి రూ.18,135 కోట్లకు చేరింది. జియో క్యూ1 లో 99 లక్షల మంది కొత్త సబ్‌‌‌‌స్క్రయిబర్లను పొందింది. దీంతో కంపెనీ  మొత్తం కస్టమర్ల బేస్‌‌‌‌ 49.81 కోట్లకు చేరింది. 

ఇందులో వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌, బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ కస్టమర్ల సంఖ్య కలిసి ఉంది. జియో ట్రూ5జీ యూజర్లు ఈ ఏడాది జూన్ 30 నాటికి 20 కోట్లు దాటారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.  

జియో ఎయిర్‌‌‌‌ఫైబర్ 74 లక్షల సబ్‌‌‌‌స్క్రయిబర్లతో గ్లోబల్‌‌‌‌గా అతిపెద్ద ఎఫ్‌‌‌‌డబ్ల్యూఏ (ఫిక్స్డ్‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌ యాక్సెస్‌‌‌‌) సర్వీస్‌‌‌‌గా నిలిచిందని తెలిపింది.  ప్లాన్ రేట్లు పెంచడంతో   జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పూ) రూ.208.7కు పెరిగింది.