Jio ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Jio Brain వచ్చేసింది.. సెల్ఫోన్లు జెట్స్పీడ్ తో పనిచేస్తాయట

Jio ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Jio Brain వచ్చేసింది.. సెల్ఫోన్లు జెట్స్పీడ్ తో పనిచేస్తాయట

జియో తన అడ్వాన్స్ డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ JioBrainను లాంచ్ చేసింది. ఇది టెలికాం,ఎంటర్ ప్రైజెస్ నెట్ వర్క్ లు, నిర్ధిష్ట ఐటీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మెషీన్ లెర్నింగ్ (ML) సామర్థ్యాలను ఏకీకృతం చేస్తుంది. ముఖ్యంగా విసృతమైన నెట్ వర్క్, ఐటీ మార్పులు, అప్ గ్రేడ్ లు అవసరం లేకుండానే లక్ష్యాన్ని సాధిస్తుంది. 

జియో బ్రెయిన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మెషీన్ లర్నింగ్ (ML) ద్వారా ఆధారితమై ఫ్లాట్ ఫారమ్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ఫ్లాట్ ఫారమ్ చే అభివృద్ధి చేయబడింది. రెండేళ్ల పాటు వందలాది మంది ఇంజనీర్లు ఫ్లాట్ ఫారమ్ ను అభివృద్ది చేశారు. 

జియో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది 

Jio బ్రెయిన్ ML సామర్థ్యాలను టెలికాం నెట్ వర్క్ లు, ఎంటర్ ప్రైజెస్ నెట్ వర్క్ లు, నిర్ధిష్ట ఐటీ పరిశ్రమ వంటి వివిధ  నెట్ వర్క్ లలోకి అనుసంధానం చేయబడుతుంది. దీని అర్థం ఇది విస్తృతమైన మార్పులు లేకుండా AI, ML తో  ఈ నెటవ్ వర్క్ లను మెరుగుపర్చవచ్చు. 

జియో బ్రెయిన్ అందించే సేవలు.. 

జియో బ్రెయిన్ అనేక రకాల సేవలను అందిస్తోంది. ఇది ML ప్రారంభించబడిన సేవలను సృష్టించేందుకు 500 APIలను అందిస్తుంది. ఇది ఇమేజ్ లు, వీడియోలు, టెక్ట్స్,  డాక్యుమెంట్లు, స్పీచ్ ను ప్రాసెస్ చేయడానికి అధునాతన AI ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇది 500+ REST API లు, డేటా APIల కలయికతో వస్తుంది. 
దీంతోపాటు కస్టమైజ్ ఎంటర్ ప్రైజెస్, పెద్ద స్థాయి LLM సామర్థ్యాలతో పాటు , ఇమేజ్లు, వీడియోలు, టెక్ట్స్ , డాక్యుమెంట్లు, స్పీచ్, ఇన్ బిల్ట్ AI అల్గారిథమ్ ల కోసం అధునాతన AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 

జియో బ్రెయిన్ ఫ్యూచర్ ఏంటీ.. 

Jio బ్రెయిన్ కొత్త 5G సేవలను సృష్టించడం, నెట వర్క్ లను ఆప్టిమైజ్ చేయడం, 6G అభివృద్ధికి వేదికను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. దీనితో ML కీలక సామర్థ్యం. జియో బ్రెయిన్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ను స్కేల్ చేసేందుకు AI/ML పరిశోధనలతో సహకరించేందుకు సిద్దంగా ఉంది.