రిలయన్స్ జియో 5జీ సేవలు షురూ

రిలయన్స్ జియో 5జీ సేవలు షురూ

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 5జీ సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌లోని రాజ్‌‌‌‌ సమంద్‌‌‌‌లోని శ్రీనాథ్‌‌‌‌జీ ఆలయం నుండి సేవలను మొదలుపెట్టారు. ఈ పట్టణంలో 5జీ పబ్లిక్​ వైఫైని కూడా షురూ చేశారు. ఇతర నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థల్లోనూ ఈ సదుపాయాన్ని తెస్తామని జియో పేర్కొంది. ఈ సంవత్సరంలోనే ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌కతా చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని టెల్కో లక్ష్యంగా పెట్టుకుంది.

జియో తన 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తహసీల్, తాలూకాకు విస్తరించాలని భావిస్తున్నట్లు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆగస్టు 29న భారతదేశంలో 5జీ లాంచ్‌‌‌‌ సందర్భంగా వెల్లడించారు.ఈ నెల ప్రారంభంలో దేశ రాజధానితోపాటు ముంబై, కోల్‌‌‌‌కతా,వారణాసి వంటి మూడు ఇతర నగరాల్లో 5జీ సేవల బీటా ట్రయల్స్‌‌‌‌ను ప్రారంభించింది. యూజర్లు 1 జీబీపీఎస్​ కంటే ఎక్కువ డౌన్‌‌‌‌లోడ్ స్పీడ్‌‌‌‌ని పొందుతున్నారని జియో తెలిపింది.