వచ్చే ఏడాది టెక్నో పెయింట్స్ ఐపీఓ..బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్

వచ్చే ఏడాది టెక్నో పెయింట్స్ ఐపీఓ..బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్

హైదరాబాద్​, వెలుగు:  పెయింట్స్ ​తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సేకరిస్తామని ప్రకటించింది.  క్రికెటర్​ సచిన్ టెండూల్కర్‌‌‌‌ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఆయనతో పనిచేయడం గర్వకారణమని టెక్నో పెయింట్స్ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్​లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. 

2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.210 కోట్ల ఆదాయం సాధించిన కంపెనీ,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల రెవెన్యూ ఆశిస్తోంది. 2029-–30 నాటికి రూ.2,000 కోట్ల ఆదాయమే లక్ష్యమని ప్రకటించింది. డెకరేటివ్, ఇండస్ట్రియల్, స్పెషాలిటీ విభాగాల్లో మూడు వేల షేడ్స్‌‌‌‌లో పెయింట్స్‌‌‌‌ను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా, చండీగఢ్​లో కార్యకలాపాలు సాగిస్తోంది. 

ఈ ఏడాది చివరినాటికి హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌‌కు విస్తరించాలని భావిస్తోంది. 2026–-27 ఆర్థిక సంవత్సరంలో మిడిల్ ఈస్ట్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.