రిలయన్స్​ లాభం తగ్గింది

రిలయన్స్​ లాభం తగ్గింది
  • లాభం రూ. 12,273 కోట్లు
  • రెవెన్యూ రూ. 1.44 లక్షల కోట్లు
  • జియో లాభం రూ. 2,519 కోట్లు

ముంబై: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ నికర లాభం జూన్​ 2021తో ముగిసిన క్యూ1లో 7.2 శాతం తగ్గి రూ. 12,273 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 13,233 కోట్లు. అయితే మార్చి 2021 క్వార్టర్​తో పోలిస్తే మాత్రం నికర లాభం 13 శాతం పెరిగి రూ. 10,845 కోట్లకు చేరింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి క్వార్టర్లో రెవెన్యూ రూ. 1.44 లక్షల కోట్లకు పెరిగింది. అయిల్​ టూ కెమికల్​ బిజినెస్​ గ్రోత్​ క్యూ1లో బాగుండగా, కరోనా సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​తో రిటెయిల్​ బిజినెస్ కొంత దెబ్బతింది. సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​ పడినప్పటికీ మంచి పనితీరునే సాధించగలిగామని ఆర్​ఐఎల్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీ చెప్పారు. ​ బీపీతో కలిసి కేజీ డీ6లో ప్రొడక్షన్​ మొదలు పెట్టామని, దేశపు గ్యాస్​ ప్రొడక్షన్​లో 20 శాతం తాము సమకూరుస్తున్నామని అన్నారు.

జియో లాభం పెరిగింది...
ఆర్​ఐఎల్​ సబ్సిడరీ జియో లాభం క్యూ1లో 45 శాతం పెరిగి రూ.3,651 కోట్లయింది. ఇదే క్వార్టర్లో ఏవరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​ (ఆర్పు) రూ. 138.4 వద్ద నిలిచింది. ఇక రిలయన్స్​ రిటెయిల్​ రెవెన్యూ 21.9 శాతం పెరిగి రూ. 38,547 కోట్లకు చేరింది. పెట్రో రిటెయిలింగ్​ బిజినెస్​ రెవెన్యూ అడ్జస్ట్​మెంట్​ తర్వాత చూస్తే రిటెయిల్​ రెవెన్యూ 32 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. కరోనా సెకండ్​వేవ్​ రెస్ట్రిక్షన్లు ఆపరేషన్స్​, ప్రాఫిటబిలిటిలపై ప్రభావం చూపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. చిన్న మర్చంట్స్​తో పార్ట్​నర్షిప్స్​ కుదుర్చుకుంటున్నామని, కన్జూమర్లతో డిజిటల్​ ఎంగేజ్​మెంట్​ పెరుగుతోందని...దీంతో ఫ్యూచర్లో రిటెయిల్​ బిజినెస్​ మరింత గ్రోత్​ సాధిస్తుందనే విశ్వాసాన్ని ముకేశ్​ అంబానీ వ్యక్తం చేశారు.