రిలయన్స్ రిటైల్ చేతికి జాన్ ప్లేయర్స్‌

రిలయన్స్ రిటైల్ చేతికి జాన్ ప్లేయర్స్‌

న్యూ ఢిల్లీ : బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోళ్ల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా కన్జ్యూ మర్ గూడ్స్ కంపెనీ ఐటీసీ లిమిటెడ్‌ కు చెందిన మెన్స్‌‌‌‌వేర్ బ్రాండ్ జాన్ ప్లేయర్స్‌‌‌‌ను రిలయన్స్ తన సొంతం చేసుకుంది. ఐటీసీకి చెందినజాన్ ప్లేయర్స్ బ్రాండ్‌ ను తన యూనిట్ రిలయన్స్  రిటైల్ లిమిటెడ్(ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ఎల్‌‌‌‌) కొనుగోలు చేసి నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించిం ది. ఈ కొనుగోలుతో ఫ్యాషన్, లైఫ్‌‌‌‌ స్టయిల్ రిటైల్  స్పేస్‌‌‌‌లో రిలయన్స్ రిటైల్ రెడీమేడ్ గార్మెం ట్స్, యాక్ససరీస్ పోర్ట్‌ ఫోలియో బలోపేతం కానుందని రిలయన్స్ తెలిపిం ది. పునర్‌‌‌‌ వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా జాన్ ప్లేయర్స్ బ్రాండ్‌ ను , దాని ట్రేడ్‌ మార్క్స్‌‌‌‌ను , ఇంటెలెచ్యువల్ ప్రాపర్టీని రిలయన్స్ రిటైల్‌‌‌‌కు అమ్మేసినట్టు ఐటీసీ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడిం చలేదు.

ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు ప్రకారం.. 750 స్టోర్ల ద్వారా జాన్ ప్లేయర్ బ్రాండ్‌ ను , దాని పంపిణీ హక్కులను రిలయన్స్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా 65 ఎక్స్‌‌‌‌క్లూజి-వ్ ఫ్రాంచైజీ అవుట్‌‌‌‌లెట్లను సొంతం చేసుకుంది. వీటి విలువ రూ.150 కోట్లుగా ఎకనామిక్ టైమ్స్ అంచనా-వేసింది. రిలయన్స్ దేశవ్యాప్తంగా రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ స్టోర్లను భారీగా పెంచుకోవాలని చూస్తోంది.557గా ఉన్న స్టోర్లను వచ్చే ఐదేళ్లలో 2,500కు పెంచుకోవాలనుకుంటోంది. వీటిని ఆన్‌‌‌‌లైన్ వ్యాపారాలతో ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ ఈకామర్స్‌‌‌‌లో కి కూడా ప్రవేశించనున్నట్టు ప్రకటించిం ది. ఈ నేపథ్యంలోనే తన ఫ్యాషన్ బిజినెస్‌‌‌‌లను విస్తరిస్తోంది. ప్రత్యర్థి కంపెనీలు అమెజాన్.కామ్, వాల్‌‌‌‌మార్ట్‌ కు చెందిన ఫ్లిప్​కార్ట్‌ లకు పోటీగా ఇండియన్ కన్జ్యూ మర్ స్పెండింగ్‌‌‌‌లో ఆధిపత్య వాటాను దక్కిం చుకోవాలని ప్రయత్ని స్తోంది. ఐటీసీజాన్ ప్లేయర్స్ బ్రాండ్‌ ను రిలయన్స్ కొనుగోలు చేసిందన్న వార్తల నేపథ్యంలో రిలయన్స్ షేర్లు ఇంట్రాడే-లో1.6 శాతం లాభాలు పండిం చాయి. ఐటీసీ షేర్లు0.95 శాతం నష్టపోయాయి.