రిలయన్స్‌‌‌‌లో జాబ్‌‌కే.. ఎక్కువ మొగ్గు! వరల్డ్ టాప్‌‌ ఎంప్లాయర్‌‌ లిస్టులో 20 వ ప్లేస్‌‌

రిలయన్స్‌‌‌‌లో జాబ్‌‌కే.. ఎక్కువ మొగ్గు! వరల్డ్ టాప్‌‌ ఎంప్లాయర్‌‌ లిస్టులో 20 వ ప్లేస్‌‌
  • ఫస్ట్ ప్లేస్‌‌లో శామ్‌‌సంగ్‌‌..

  • టాప్‌‌ 10 లో 9 యూఎస్ కంపెనీలే

 న్యూఢిల్లీ: జాబ్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించే టాప్ కంపెనీల లిస్టులో ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుంది. ప్రాఫిట్స్, రెవెన్యూ, మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీ  అయిన రిలయన్స్,  ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసిన ‘వరెల్డ్స్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయర్స్‌‌‌‌‌‌‌‌’ లిస్టులో 20 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకుంది. టాప్ 100 లో ఇండియా నుంచి కేవలం రిలయన్స్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే చోటు దక్కింది. ప్రస్తుతం ఈ కంపెనీ కింద   2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ లిస్టులో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో  సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియన్ కంపెనీ శామ్‌‌‌‌‌‌‌‌సంగ్ ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌, ఐబీఎం, ఆల్ఫాబెట్‌‌‌‌‌‌‌‌, యాపిల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ లిస్టులో  రెండో ప్లేస్ నుంచి 12 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌ వరకు యూఎస్ కంపెనీలే ఉన్నాయి. 13 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో జర్మనీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ గ్రూప్‌‌‌‌‌‌‌‌, 14 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ షాపింగ్ కంపెనీ అమెజాన్‌‌‌‌‌‌‌‌లు నిలిచాయి. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ డెకత్లాన్‌‌‌‌‌‌‌‌ 15 వ ర్యాంక్ దక్కించుకుంది.

ఇండియా నుంచి..

ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్స్‌‌‌‌‌‌‌‌ బెస్ట్ ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టులో  జర్మనీ కంపెనీ మెర్సెడెజ్ బెంజ్‌‌‌‌‌‌‌‌, యూఎస్ కంపెనీ కోకకోలా, జపనీస్ కంపెనీలయిన హోండా, యమహా, సౌదీ ఆరేబియా కంపెనీ సౌదీ ఆరామ్‌‌‌‌‌‌‌‌కోలను రిలయన్స్ దాటింది. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ (137 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌), బజాజ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ (173 ), ఆదిత్య బిర్లా గ్రూప్ (204), హీరో మోటోకార్ప్‌‌‌‌‌‌‌‌ (333), లార్సెన్‌‌‌‌‌‌‌‌ అండ్ టుబ్రో (354), ఐసీఐసీఐ బ్యాంక్ (365), హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ టెక్‌‌‌‌‌‌‌‌ (455), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (499), అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌ (547), ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ (668) లు ఇండియా నుంచి  టాప్  ప్లేస్‌‌‌‌‌‌‌‌లను దక్కించుకున్నాయి. 2021 కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైన గ్రేట్ రెజిగ్నేషన్ ప్రభావం ఇంకా స్లో అవ్వలేదని, దీని వలన  మొత్తం వర్క్‌‌‌‌‌‌‌‌ఫ్లేస్‌‌‌‌‌‌‌‌ విధానాలు మారిపోయాయని ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది.

శాలరీ ఎక్కువగా ఉండాలని, మంచి బెనిఫిట్స్ అందాలని,  అవకాశాలు దొరకాలని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. వీటికి అదనంగా పని అనేది ఒక పర్పస్‌‌‌‌‌‌‌‌తో చేసేటట్టు ఉండాలని అనుకుంటున్నారు. ఈ విషయాలను కంపెనీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయని ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ వివరించింది. ఈ అంశాల ఆధారంగానే  వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్‌‌‌‌‌‌‌‌ ఆరోవ యాన్యువల్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను  తీసుకొచ్చింది. మార్కెట్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్ కంపెనీ స్టాటిస్టాతో కలిసి 57 దేశాల్లోని 1,50,000 మంది ఫుల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌, పార్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ వర్కర్ల అభిప్రాయాలను సేకరించి ఈ లిస్టును తయారు చేశామని ఫోర్బ్స్ పేర్కొంది. మల్టీ నేషనల్ కంపెనీల్లో (ఎంఎన్‌‌‌‌‌‌‌‌సీ) పనిచేసే ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించామని వివరించింది.

‘చాలా మంది పార్టిసిపెంట్‌‌‌‌‌‌‌‌లు తాము పనిచేస్తున్న కంపెనీ గురించి ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌కు, ఫ్యామిలీకి ఇచ్చే రికమండేషన్స్‌‌‌‌‌‌‌‌పై  రేటింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని అడుగుతున్నారు. అలానే ఇతర ఇండస్ట్రీల్లోని కంపెనీలను కూడా  విశ్లేషించండని కోరుతున్నారు. ఈ ఏడాది విడుదల చేసిన లిస్టులో 800 కంపెనీలు ఉన్నాయి. ఎక్కువగా స్కోర్ సంపాదించిన కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి’ అని ఫోర్బ్స్ పేర్కొంది. ఇమేజ్‌‌‌‌‌‌‌‌, ట్యాలెంట్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయగలగడం, జెండర్ ఈక్వాలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్థిక వ్యవస్థలో వీటి పాత్ర..వంటి వివిధ అంశాల్లో కంపెనీలకు ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ రేటింగ్ ఇచ్చి ఈ లిస్టును తయారు చేసింది.