వాహనదారులకు రిలీఫ్.. కాస్త తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు రిలీఫ్.. కాస్త తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహన వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగింది. నవంబర్ 30తో పోలిస్తే.. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 5పైసలు, 4పైసల చొప్పున తగ్గాయి. విజయవాడలో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 111.87 గాను, లీటర్ డీజిల్ రూ.99.61 గా ఉంది. హైదరాబాద్ సిటీలో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదైన ధరలతో పోల్చితే ఇవాళ హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి తేడా లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు లీటరు పెట్రోల్ ధర రూ. 96.72 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 89.62 గా నమోదైంది, దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31గాను, అలాగే డీజిల్ ధర లీటర్ రూ. 94.27గా నమోదు కాగా.. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి వ్యత్యాసం లేదు.