రెమాల్ తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

రెమాల్ తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

రెమాల్  తుఫాన్ ధాటికి ఈశాన్య రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు భవనాలు కుప్పకూలాయి. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయారు. వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. 

విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రమాదంపై దిగ్భాంత్రి వ్యక్తం చేశారు సీఎం లాల్దుహోమా. మృతుల కుటుంబాలకు...15 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటిచాంరు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించి సంతాపం వ్యక్తం చేశారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు స్పీడప్ చేయాలని సూచించారు. 
 
మరోవైపు బెంగాల్, మేఘాలయలో భారీ వర్షం, ఈదురులు గాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఇండ్లు ధ్వంసం అయ్యాయి. మేఘాలయలో  భారీ వర్షం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దాదాపు 17 గ్రామాలకు నష్టం వాటిల్లిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. 
 
అసోంలో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. రెమాల్ తుపాను ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా  అసోంలో భారీ నష్టం జరిగింది. అసోంలోని 9 జిల్లాల స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు సీఎం హిమంత భిశ్వశర్మ.
 
ఇటు కేరళలోనూ ఎడతెగని వానలు, పెనుగాలులతో సాధారణ జీవనానికి అంతరాయం కలిగింది. తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో కుంభవృష్టి కురిసింద. అనేకచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
 
ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది  భారత వాతావరణ శాఖ. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.