యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ తొలగింపు

యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ తొలగింపు

యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీ ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ గా ఉన్న రేణుకా మిశ్రాను తొల‌గిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు ప‌రీక్ష నియామ‌కంలో పార‌ద‌ర్శక‌త లోపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావడంతో యూపీ ప్రభుత్వం ఫిబ్రవ‌రి 11వ తేదీన జ‌రిగిన పోలీసు ప‌రీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

సోష‌ల్ మీడియాలో పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పేప‌ర్ స‌ర్క్యూలేట్ అవ్వడంతో పేప‌ర్ లీక్ వ‌ల్ల పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్షను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రక‌టించింది. ఈ ప‌రీక్షను మ‌ళ్లీ ఆరు నెల‌ల్లోగా నిర్వహించాల‌ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. రీఎగ్జామ్‌కు ఉచిత ట్రాన్స్‌పోర్ట్ క‌ల్పించ‌నున్నట్లు అధికారులు తెలిపారు. 

పేప‌ర్ లీక్ కేసును విచారించేందుకు స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు 60 వేల 244 కానిస్టేబుల్ పోస్టులకు 50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, రెండు షిఫ్టుల్లో జరిగిన పరీక్షలకు 43 లక్షల మంది హాజరయ్యారు.