టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్న స్టార్స్ రెమ్యునరేషన్

టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్న స్టార్స్ రెమ్యునరేషన్

కరోనా క్రైసిస్ ను పట్టించుకోని స్టార్స్

 హీరోలకో రూల్..? మాకో రూలా?  అంటున్న హీరోయిన్లు

టాలీవుడ్ లో కరోనా క్రైసిస్  హాట్ టాపిక్ గా మారింది. క్రైసిస్ నుండి బయటపడేందుకు తమ వంతు ఖర్చులు తగ్గించుకోవాలనే ప్రతిపాదనల విషయంలో హీరో వర్సెస్ హీరోయిన్లు అన్న రీతిలో వాడీ వేడీ చర్చ జరుగుతోంది. బిగ్ స్టార్స్ ఎవరూ తమ రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అంగీకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ గోల్డెన్ స్టార్ గా భావిస్తున్న ఓ యంగ్ హీరోయిన్ తన రెమ్యునరేషన్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తోందన్న విషయంపై ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. కరోనా కు ముందు తాను నటించిన అన్ని సినిమాలు సూపర్  డూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఆమె టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ అనే భావన ఉంది. కరోనాకు ముందు ఆమె సినిమాలన్నీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. తాను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఒక రకంగా ఫెయిల్యూర్ లేని హిస్టరీ ఉన్న ఏకైక హీరోయిన్ ఉంటే ఓపెనింగ్స్ బాగుంటాయని భావించిన ఓ ఔత్సాహిక నిర్మాత తన సినిమాలో ఆమెను పెట్టుకోవాలని ప్రయత్నించి షాక్ తిన్నాడట. తన ట్రాక్ రికార్డు చూసి గతంలో తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 30 శాతం ఎక్కువ డిమాండ్ చేస్తోందని తెలసి మిన్నకుండిపోయారట. కారణం ఏమిటని అడిగితే.. హీరోలెవరూ తగ్గించుకోనప్పుడు.. మేమెందుకు తగ్గించుకోవాలని హీరోయిన్లు చెబుతున్నారట. ఆఫ్ ద రికార్డుగా దాదాపు అందరూ ఇవే మాటలు చెబుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిర్మాతల మండలి కూడా స్టార్స్ ను ఏమీ అనలేక ప్రస్తుతానికి మౌన వ్రతం పాటిస్తోంది. మెల్లగా థియేటర్లు తెరచుకుంటుండడం.. ఇంకో వైపు షూటింగులు కూడా జరుగుతుండడంతో  కరోనా క్రైసిస్ నుంచి బయటపడినట్లేనని అనిపిస్తోంది. ఇదే సమయంలో రెమ్యునరేషన్ ల తగ్గింపు వివాదం చెలరేగడం.. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది.