Renu Desai: కల్కి సినిమాపై రేణు దేశాయ్ రివ్యూ.. కనీసం వారం రోజులైనా..!

Renu Desai: కల్కి సినిమాపై రేణు దేశాయ్ రివ్యూ.. కనీసం వారం రోజులైనా..!

నటి రేణు దేశాయ్ కల్కి 2898 ఏడీ సినిమా చూశారు. ఈరోజు(జూన్ 27) ఉదయం ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఆమె ఈ సినిమా వీక్షించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. రేణు దేశాయ్ తనయుడు అకిరా కూడా ఈ షోకి వచ్చారు. అది కూడా కల్కి ట్ షర్ట్ లో. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక కల్కి 2898 ఏడీ సినిమా చూసిన అనంతరం రేణు దేశాయ్ తన రివ్యూ ఇచ్చారు.

తన ఇన్స్టాగ్రామ్ ఈ మేరకు ఓ పోస్ట్ కూడా పెట్టారు. మేమంతా కల్కి అభిమానులం. చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ అరిచి గోల చేసాం. కనీసం ఒక వారం రోజులైనా మా గొంతు పనిచేయవేమో. ఈ రోజు ఉదయమే కల్కి మార్నింగ్ షో  చూశాం. మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి వెళ్లి ఖచ్చితంగా కల్కి సినిమా చూడండి.. అని రాసుకొచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్వన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. విడుదల తరువాత ఆ అంచనాలను అందుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. కథ, కథనం, విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతానికి లింక్ చేసిన విధానం, భవిష్యత్ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన తీరుకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో.. రానున్న రోజుల్లో ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.