కమ్మోళ్లు కోపంగా ఉన్నారు.. తక్కువ చేస్తే ప్రతాపం చూపిస్తారు : రేణుకాచౌదరి వార్నింగ్

కమ్మోళ్లు కోపంగా ఉన్నారు.. తక్కువ చేస్తే ప్రతాపం చూపిస్తారు : రేణుకాచౌదరి వార్నింగ్

కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులానికి అధికంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. అక్టోబర్ 27వ తేదీ ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో మీటింగ్ తర్వాత మాట్లాడారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ కులానికి తగిన ప్రాధాన్యం కల్పించాలి. సామాజిక న్యాయం జరగటం లేదని.. బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారామె. 
డబ్బున్న వాళ్లకే కాదు.. దమ్మున్న వారికి టికెట్లు ఇవ్వాలని కోరారు రేణుకాచౌదరి
కమ్మ కులాన్ని గుర్తించాలని.. కమ్మ కులస్తులు చాలా కోపంగా.. ఉద్రేకంగా ఉన్నారని చెప్పుకొచ్చారామె.
కమ్మ కులం వాళ్ల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానాన్ని కోరాం అని.. పిల్లికి బిచ్చం వేసినట్లు సీట్లు ఇస్తామంటే కుదరదని కూడా స్పష్టం చేసినట్లు వెల్లడించారామె.
ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తాం అంటే తీసుకోం అని.. కమ్మ కులస్తులను తక్కువ అంచనా వేయొద్దంటూ ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు రేణుకాచౌదరి. అలా చేసినట్లే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హైకమాండ్ కు చెప్పినట్లు వెల్లడించారామె.
కమ్మ కులానికి ఎక్కువ సీట్లు ఇస్తే.. మా ఓట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయన్నారామె. మిగతా పార్టీల వాళ్లు కమ్మోళ్లకు పిలిచి టికెట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. 
గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కమ్మ వర్గానికి ఇవ్వలేదని.. మరో వర్గానికి ఏకంగా 38 సీట్లు ఇస్తే.. వారిలో చాలా మంది మిగతా పార్టీల్లోకి వెళ్లిపోయారన్నారు.

ALSO READ : కాంగ్రెస్ లో చేరిన మోత్కుపల్లి, నీలం మధు

కమ్మ కులానికి చెందిన వారికి కనీసం 12 సీట్లు అయినా ఇవ్వాలని.. అవి కూడా గెలిచే సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర.. కమ్మవారి ఐక్య వేదిక నేతలతో కలిసి డిమాండ్ చేశారు రేణుకా చౌదరి.