రేణుక పిటిషన్ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

రేణుక పిటిషన్ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న రాథోడ్‌  రేణుకకు చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆమె ధాఖాలు చేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తనకు అనారోగ్యంగా ఉందని, చిన్నారుల  బాగోగులు చూసుకునేవారు ఎవరూ లేరని కోర్టును ఆశ్రయించింది.  పేపర్ లీక్ తో తనకు ప్రత్యేక్ష ప్రమేయం లేదని  కేవలం నేర అభియోగాలు మాత్రమే చేశారని తన ఫిటిషన్ లో పేర్కొంది.  

అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, చాలా మంది పాత్ర ఇందులో ఉందని,  సిట్ విచారణలో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఇటీవల అరెస్టైన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను వారం రోజులు  కస్టడీకి  ఇవ్వాలని సిట్ అధికారులు కోరగా ఏప్రిల్ 03 (సోమవారం) కోర్టు తీర్పు ఇవ్వనుంది.