- ఊర చెరువుకు టెంపరరీ రిపేర్లు
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం బొక్కలగుట్టలోని ఊరచెరువు మత్తడి వద్ద కట్ట తెగిపోయే ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ఆదివారం రిపేర్లు చేపట్టారు. చెరువు తూము పక్కన పెద్ద బుంగ పడిందని, కట్టతెగిపోయి ప్రమాదం ఉందని గ్రామస్తులు ఫోన్లో ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఆఫీసర్లకు రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు.
ఇరిగేషన్డీఈ శారద, ఏఈ రమ్య, వర్కింగ్ఇన్స్పెక్టర్చంద్రమౌళి, పంచాయతీ సెక్రటరీ విద్యాలత పర్యవేక్షణలో చెరువు తూము వద్ద కట్టకు పడిన బుంగను మట్టితో నింపారు. వందలాది ఇసుక బస్తాలను అడ్డుగా వేసి టెంపరరీ రిపేర్లు చేశారు.
గ్రామస్తులు సహకారం అందించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన ఫండ్స్కోసం రిపోర్టులు రెడీ చేయాలని సంబంధితా ఆఫీసర్లను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు.