ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్

ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిషియన్ దిన్షా పార్దివాలా ఈ ఆపరేషన్‌ చేశారు. పార్దివాలా స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్‌లో నిపుణుడు కాగా, ప్రస్తుతం స్పోర్ట్స్ మెడిసిన్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. పంత్‌కు సైతం ఆయనే చికిత్స అందిస్తున్నారు. కప్‌ గెలిచిన 48 గంటల్లోనే ఈ చికిత్స జరగడం గమనార్హం. 

ఇటీవల జరిగిన ఐపీఎల్‌ టోర్నీలో మహీ మోకాలి సమస్యతో బాధపడ్డ సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా సీఎస్‌కే చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోని మైదానం అంతా కలియతిరిగాడు. అభిమానుల వైపు జెర్సీలు విసిరాడు. ఆ సమయంలో ధోనీ తన మోకాలికి సపోర్ట్ కోసం క్యాప్ ధరించి కన్పించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇదిలావుంటే ధోని శస్త్రచికిత్సకు వెళ్లేముందు భగవద్గీత చదువుతూ కనిపించాడు.