
- ఆఫీసర్లను ఆదేశించిన ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్
కాగజ్‌నగర్, వెలుగు : తుమ్మడిహెట్టిని వద్ద ప్రాణహిత నది పరిసరాలను మంగళవారం ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ప్రాజెక్ట్ నిర్మించేందుకు గుర్తించిన స్థలం, ప్రస్తుత ప్రతిపాదిత స్థలాన్ని ఆఫీసర్లు మ్యాప్ ద్వారా వివరించారు. నదిలో నీటి లభ్యత, ప్రస్తుత వరద ప్రవాహం, భూమి పరిస్థితి వంటి వివరాలను ఆరా తీశారు.
నదీతీరంలో పర్యటించి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేయాలని, సమగ్ర వివరాలతో రిపోర్ట్‌ను రెడీ చేసి ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. అక్కడి నుంచి ప్యాకేజీ 1, 2, 3లో నిర్మించే కాల్వలను పరిశీలించేందుకు చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాలకు వెళ్లారు. కాగా, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని కోరుతూ సీపీఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్, నాయకులు కలిసి ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆయన వెంట ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సత్యరాజ చంద్ర, కాగజ్‌నగర్ ఎస్‌ఈ రవికుమార్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, డీఈ ఎల్లా వెంకటరమణ, భద్రయ్య, తిరుపతి, భానుమూర్తి, ఏఈఈ రాజ్‌కుమార్, మణితేజ, సాయితేజ ఉన్నారు. అనంతరం మంచిర్యాలలోని సీఈ ఆఫీస్‌కు చేరుకున్న ప్రశాంత్‌జీవన్ పాటిల్ అక్కడ ఇంజినీర్లతో సమావేశమై ప్యాకేజీల వారీగా వివరాలు, ఇప్పటివరకు జరిగిన పనులు, ఇకపై చేయాల్సిన పనుల గురించి చర్చించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉన్నందున పూర్తి నివేదిక ఇవ్వాలని
ఆదేశించారు