IND vs ENG: టీమిండియాకు మరో దెబ్బ.. మూడో టెస్టుకు రాహుల్ దూరం!

IND vs ENG: టీమిండియాకు మరో దెబ్బ.. మూడో టెస్టుకు రాహుల్ దూరం!

టీమిండియాను గాయాల బెడద వీడటం లేదు. ఒక ఆటగాడు కోలుకున్నారు అనుకునేలోపే మరో ఆటగాడు జట్టుకు దూరమవుతున్నారు.  ఇప్పటికే విరాట్ కోహ్లీ గైర్హాజరీ, గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమవ్వడంతో భారత బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందనుకుంటే.. ఇప్పుడు మరో కీలక ఆటగాడు దూరమయ్యాడు. క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరంగా ఉన్న రాహుల్.. మూడో టెస్టుకు బరిలోకి దిగడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో మూడో టెస్టుకు రాహుల్ అందుబాటులో ఉంటారని మొదట భావించారు. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందలేకపోయాడు. దీంతో అతన్ని పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో కర్ణాటక లెఫ్ట్ హ్యాండర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ స్థానంలో రాజ్‌కోట్ టెస్ట్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్‌ అరంగేట్రం చేయనున్నాడని సమాచారం. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలు సాధించాడు.

చివరి మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌ గిల్, కేఎల్ రాహుల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్‌ ఖాన్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌.
Also Read : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ స్టార్