వారం పాటు రిపబ్లిక్ డే వేడుకలు

వారం పాటు రిపబ్లిక్ డే వేడుకలు

ఈ ఏడాది నుంచి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వారం రోజులు నిర్వహించనుంది కేంద్ర రక్షణ శాఖ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23 నుంచి 30 వరకు ఉత్సవాలు జరపనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్ లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 9 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు పాల్గొననున్నాయి. 

అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చత్తీస్ గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలకు చెందిన శకటాలు పరేడ్ కు ఎంపికయ్యాయి. తిరస్కరణకు గురైన శకటాలపై ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించామని రక్షణ శాఖ తెలిపింది. దీనిపై పునరాలోచన అవకాశం లేదని స్పష్టం చేసింది. కేంద్ర విద్య, పౌర విమానయాన, కమ్యూనికేషన్, హాం, హౌజింగ్ అండ్ అర్బన్, టెక్స్ టైల్స్, న్యాయ, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలు పాల్గొననున్నాయి. 

కరోనా నేపథ్యంలో రిపబ్లిక్ డేకు ఐదు మధ్య ఆసియా దేశాల నాయకులను ముఖ్య అతిథులుగా పిలవాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. అలాగే వేడుకలకు సందర్శకుల సంఖ్యను కుదించింది. గతేడాది దాదాపు 25 వేల మందికి అనుమతి ఇచ్చారు. ఈసారి 5 నుంచి 8 వేల మందికే పర్మిషన్ ఇస్తున్నారు. మరోవైపు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నార్త్, సౌత్ బ్లాక్ పై లేజర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

అప్పుడు నవ్వారు.. ఇప్పుడు కష్టాలు చెప్పుకుని ఏడుస్తున్నరు

మంగళసూత్రం ధరించినప్పుడు అలా ఫీల్ అయ్యా: ప్రియాంకా చోప్రా

ఈ సారి రిపబ్లిక్ డేలో చాలా ప్రత్యేకతలు