నిరాడంబరంగా ముగిసిన గణతంత్ర వేడుకలు

నిరాడంబరంగా ముగిసిన గణతంత్ర వేడుకలు

కరీంనగర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ కు బదులు ఇరుకుగా ఉన్న కలెక్టరేట్ ముందు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు నిమిషాల్లోనే రిపబ్లిక్ వేడుకల తంతు ముగియడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వేడకలకు హాజరైన కలెక్టర్ ఆర్వీ కర్ణన్... గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ప్రతీ ఏడాదిలా కాకుండా ఈ సారి గణతంత్ర దినోత్సవ సందేశం ఇవ్వకుండానే వేడుకలను ముగించివేశారు. శకటాల ప్రదర్శన, పోలీసుల పేరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలేమీ లేకుండానే ఈ సారి గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అంతే కాదు ఈ వేడుకలకు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాలేదు. కేవలం అధికారుల సమక్షంలోనే జెండావందనం జరగడం గమనార్హం. దాంతో పాటు సీపీ సత్యనారాయణ కూడా గైర్హాజరయ్యారు. అయితే సీపీ సత్యనారయణ నిన్ననే బదిలి అయినప్పటికీ కొత్త సీపీ బాధ్యతలు తీసుకునే వరకు పాతవాళ్లే విధులు నిర్వహించాలి. ఆ సంప్రదాయం సైతం ఈ వేడుకల్లో కనిపించలేదు.