ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. స్థానిక రిజర్వేషన్లు ఖరారు.. 2019తో పోలిస్తే బీసీల స్థానాలు డబుల్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. స్థానిక రిజర్వేషన్లు ఖరారు.. 2019తో పోలిస్తే బీసీల స్థానాలు డబుల్
  • ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రకటన
  • మొత్తం సీట్లలో సగం స్థానాలు మహిళలకు కేటాయింపు 
  • రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు పెరిగిన స్థానాలు

కరీంనగర్/పెద్దపల్లి/జగిత్యాల/రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు.

 ఇన్నాళ్లు ఎంపీటీసీ, జడ్పీటీసీగానో, సర్పంచ్‌‌‌‌‌‌‌‌గానో పోటీ చేద్దామనుకున్న ఆశావహుల్లో కొందరికి రిజర్వేషన్లు కలిసి రాగా.. మరికొందరి ఆశలు గల్లంతయ్యాయి.  కొన్నిచోట్ల ఆయా పార్టీలు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

2019తో పోలిస్తే బీసీల స్థానాలు డబుల్ 

కరీంనగర్ జిల్లాలో 2019లో మొత్తం 15 ఎంపీపీ స్థానాల్లో బీసీలకు 3 స్థానాలు రాగా.. ఈ సారి రిజర్వేషన్ల పెంపుతో 6 స్థానాలు దక్కాయి. 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌019లో 15 జడ్పీటీసీ స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు కేటాయించగా.. ఈ సారి 6 స్థానాలకు పెరిగింది.  2019లో పెద్దపల్లి జిల్లాలో ఎంపీపీ స్థానాలకు బీసీలకు 5 ఉండగా.. ఈసారి కూడా అంతే ఉన్నాయి. జడ్పీటీసీల్లో 3 స్థానాలు దక్కగా.. ఈసారి 6కు పెరిగాయి. జగిత్యాల జిల్లాలో 2019తో పోలిస్తే ప్రస్తుతం బీసీలకు 4 చొప్పున ఎంపీపీలు, జడ్పీటీసీస్థానాలు పెరిగాయి.  

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజర్వేషన్లు ఇలా.. 

కొత్తపల్లి ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(జనరల్), గంగాధర ఎంపీపీ(జనరల్ మహిళ), జడ్పీటీసీ(జనరల్), మానకొండూర్ ఎంపీపీ(జనరల్ మహిళ), జడ్పీటీసీ(జనరల్ మహిళ), రామడుగు ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ(ఎస్సీ జనరల్), చిగురుమామిడి ఎంపీపీ(బీసీ జనరల్), జడ్పీటీసీ(జనరల్ మహిళ), కరీంనగర్ రూరల్ ఎంపీపీ(ఎస్సీ జనరల్), జడ్పీటీసీ(ఎస్సీ జనరల్​), చొప్పదండి ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ(బీసీ జనరల్), శంకరపట్నం ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ(బీసీ మహిళ), ఇల్లందకుంట ఎంపీపీ(బీసీ జనరల్), జడ్పీటీసీ(బీసీ జనరల్), తిమ్మాపూర్ ఎంపీపీ(ఎస్సీ జనరల్), జడ్పీటీసీ(బీసీ మహిళ), వి.సైదాపూర్ ఎంపీపీ(ఎస్సీ మహిళ), జడ్పీటీసీ(ఎస్సీ మహిళ), జమ్మికుంట ఎంపీపీ(బీసీ జనరల్), జడ్పీటీసీ(బీసీ మహిళ), వీణవంక ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(బీసీ జనరల్), హుజూరాబాద్ ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(జనరల్ మహిళ),  గన్నేరువరం ఎంపీపీ(జనరల్ మహిళ), జడ్పీటీసీ(జనరల్).

పెద్దపల్లి జిల్లాలో ఇలా..

పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీలు, 13 ఎంపీపీలు ఉన్నాయి. పెద్దపల్లి జడ్పీటీసీ (బీసీ మహిళ), ఎంపీపీ (జనరల్), కాల్వ శ్రీరాంపూర్ జడ్పీటీసీ(బీసీ మహిళ), ఎంపీపీ ( జనరల్ మహిళ), ఓదెల జడ్పీటీసీ(జనరల్ మహిళ), ఎంపీపీ (జనరల్), సుల్తానాబాద్ జడ్పీటీసీ(బీసీ జనరల్), ఎంపీపీ(బీసీ మహిళ), ఎలిగేడు జడ్పీటీసీ(జనరల్), ఎంపీపీ(ఎస్సీ), జూలపల్లి జడ్పీటీసీ(ఎస్సీ మహిళ), ఎంపీపీ(ఎస్సీ మహిళ), ధర్మారం జడ్పీటీసీ(ఎస్సీ), ఎంపీపీ( బీసీ), పాలకుర్తి జడ్పీటీసీ( ఎస్సీ), ఎంపీపీ(ఎస్సీ), అంతర్గాం జడ్పీటీసీ(బీసీ మహిళ), ఎంపీపీ (బీసీ), కమాన్ పూర్ జడ్పీటీసీ(జనరల్ మహిళ), ఎంపీపీ (జనరల్), రామగిరి జడ్పీటీసీ( బీసీ), ఎంపీపీ(బీసీ), మంథని జడ్పీటీసీ(బీసీ జనరల్), ఎంపీపీ(బీసీ మహిళ), ముత్తారం జడ్పీటీసీ(జనరల్), ఎంపీపీ (జనరల్ మహిళ) డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు.  జగిత్యాల జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.

 బీర్పూర్ ఎంపీపీ(ఎస్టీ జనరల్), జడ్పీటీసీ(ఎస్టీ జనరల్), ఎండపల్లి ఎంపీపీ(ఎస్సీ మహిళ), జడ్పీటీసీ(ఎస్సీ మహిళ), బుగ్గారం ఎంపీపీ(ఎస్సీ మహిళ), జడ్పీటీసీ(జనరల్ మహిళ), కొడిమ్యాల ఎంపీపీ(ఎస్సీ జనరల్), జడ్పీటీసీ(ఎస్సీ జనరల్), మల్యాల ఎంపీపీ(ఎస్సీ జనరల్), జడ్పీటీసీ(ఎస్సీ మహిళ), రాయికల్ ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ( బీసీ జనరల్), భీమారం ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ(బీసీ మహిళ), గొల్లపల్లి ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ(ఎస్సీ), కోరుట్ల ఎంపీపీ(బీసీ మహిళ), జడ్పీటీసీ(బీసీ), పెగడపల్లి ఎంపీపీ(బీసీ), జడ్పీటీసీ(బీసీ మహిళ), జగిత్యాల ఎంపీపీ (బీసీ), జడ్పీటీసీ(బీసీ మహిళ), మేడిపల్లి ఎంపీపీ(బీసీ), జడ్పీటీసీ(బీసీ మహిళ), వెల్గటూర్ ఎంపీపీ(బీసీ), జడ్పీటీసీ(బీసీ), ధర్మపురి ఎంపీపీ( జనరల్ మహిళ), జడ్పీటీసీ(జనరల్), మెట్‌‌‌‌‌‌‌‌పల్లి ఎంపీపీ( జనరల్ మహిళ), జడ్పీటీసీ(బీసీ), జగిత్యాల రూరల్ ఎంపీపీ(జనరల్ మహిళ), జడ్పీటీసీ(జనరల్), సారంగాపూర్ ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(బీసీ), మల్లాపూర్ ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(జనరల్ మహిళ), ఇబ్రహీంపట్నం ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(జనరల్), కథలాపూర్ ఎంపీపీ(జనరల్), జడ్పీటీసీ(జనరల్ మహిళ).

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇలా...

బోయినిపల్లి జడ్పీటీసీ(బీసీ జనరల్), ఎంపీపీ (బీసీ మహిళ), కోనరావుపేట జడ్పీటీసీ(ఎస్సీ), ఎంపీపీ(ఎస్సీ), తంగళ్లపల్లి జడ్పీటీసీ (బీసీ జనరల్​), ఎంపీపీ( జనరల్), ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ( జనరల్ మహిళ), ఎంపీపీ(  బీసీ జనరల్), గంబీరావుపేట మండలం జడ్పీటీసీ(బీసీ), ఎంపీపీ( బీసీ), ముస్తాబాద్  జడ్పీటీసీ( బీసీ మహిళ), ఎంపీపీ( ఎస్సీ మహిళ), వీర్నపల్లి జడ్పీటీసీ(జనరల్), ఎంపీపీ (జనరల్ మహిళ), రుద్రంగి జడ్పీటీసీ (ఎస్టీ), ఎంపీపీ (బీసీ), వేములవాడ రూరల్ జడ్పీటీసీ(ఎస్సీ మహిళ ), ఎంపీపీ( ఎస్టీ), వేములవాడ అర్బన్ జడ్పీటీసీ(బీసీ మహిళ ), ఎంపీపీ(బీసీ), చందుర్తి జడ్పీటీసీ(బీసీ), ఎంపీపీ(బీసీ), ఇల్లంతకుంట జడ్పీటీసీ(ఎస్సీ మహిళ), ఎంపీపీ (బీసీ మహిళ).