బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలె

బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలె

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన  ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల ని బీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. బీసీలకు క్రీమీలేయర్ రూల్​ తొలగించాలని, ఇందుకోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరింది. ఆది వారం హైదరాబాద్​లో ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ నిరంజన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించా రు. బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీగా సర్నాల వెంకన్నయాదవ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా వంగూరు నారాయణ నియమితులయ్యారు.