
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేటును 6.5 శాతంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశంలో ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. ధరలను అదుపు చేసేందుకు, ఆహార వస్తువుల ధరలు పెరుగుతుండటంతో RBI ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను కూడా పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడికి 2022 మే నుంచి 2023 ఫిభ్రవరి మధ్య కాలంలో కీలక వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.