
టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆఫ్ సీజన్‌లో ఐదు డ్యామ్‌లు నిండాయి, . పూర్తిస్థాయిలో జలాశయాలు నిండటంతో నీటి నిల్వలతో డ్యామ్‌లు కళకళలాడనున్నాయి. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుమలలో ఐదు జలాశయాలు నిర్మించింది. భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో అందుకనుగుణంగా నీటి వాడకం పెరుగుతూ రావడంతో నిల్వలకోసం టీటీడీ డ్యామ్‌లను నిర్మిస్తూ వచ్చింది. మొదటి డ్యామ్ గోగర్భం డ్యాం కు పూర్తి స్థాయిలో నీళ్ళు చేరుకోవడంతో మరీ కాసేపట్లో ( వార్త రాసే సమయానికి) గేట్లు ఎత్తి నీరును లోతట్టు ప్రాంతానికి విడుదల చేయడానికి టీటీడీ వాటర్ వర్క్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గోగర్భం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 2894 అడుగులకు గాను 2887 అడుగులకు మేర నీళ్ళు చేరుకోవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తర్వాత చిన్నదైన ఆకాశగంగ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 865 మీటర్లకు గాను 859.80 మీటర్ల మేర నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పాపవినాశనం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 697.14 మీటర్లు కాగా ఇప్పటికే 693.60 మీటర్లకు నీరు చేరుకుంది. ఇక జంట ప్రాజెక్టులైన కుమార దారా డ్యాం పూర్తి సామర్థ్యం 898.24 మీటర్లు కాగా 896.20 వరద నీరు చేరుకుంది. పసుపు దారా డ్యాం సామర్థ్యం 898.28 కు గాను ఇప్పటికీ 895.90 మీటర్లకు మేరకు నీరు చేరింది.