తాగునీరు వృథా చేస్తే 5 వేల జరిమానా

తాగునీరు వృథా చేస్తే 5 వేల జరిమానా
  •     తీవ్ర తాగునీటి ఎద్దడితో బెంగళూరు వాటర్ సప్లై బోర్డ్ నిర్ణయం
  •     రూల్ ఉల్లంఘిస్తే ప్రతిసారి రూ.500 జరిమానా పెంపు

బెంగళూరు :  కర్నాటక రాజధాని బెంగళూరులో తీవ్ర తాగునీటి కరువు ఏర్పడింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో సిటీలో ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి ఎద్దడి నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు బెంగళూరు వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు చర్యలు చేపట్టింది. మంచి నీటిని వృథా చేసినా, ఇతర అవసరాలకు వినియోగించినా రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. వెహికల్స్​ కడగడం, కన్​స్ట్రక్షన్, ఎంటర్​టైన్​మెంట్ కోసం మంచినీటిని వాడకూడదని స్పష్టం చేసింది. 

మళ్లీ మళ్లీ నీళ్లను వేస్ట్ చేస్తే ప్రతిసారీ అదనంగా రూ. 500 జరిమానా విధిస్తామని ప్రకటించింది.బెంగళూరు జనాభా 1.3 కోట్లు.. సిటీ రోజువారీ నీటి అవసరాలలో  ప్రస్తుతం 1,500 ఎంఎల్‌‌‌‌‌‌‌‌డీ కొరతను ఎదుర్కొంటోంది. బెంగళూరు తోపాటు తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లోనూ త్వరలో ఇదే పరిస్థితి తలెత్తేలా ఉంది. రాష్ట్రంలో 219 తాలూకాలు తీవ్రమైన కరువు ఎదుర్కొంటుండగా, 236 తాలూకాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వం చెప్తున్నది.