ఇక్కడ సర్వర్లే.. తినిపిస్తారు!

ఇక్కడ సర్వర్లే.. తినిపిస్తారు!

చిన్నప్పుడు అందరూ అమ్మచేతి గోరుముద్దలు తినే ఉంటారు. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ కడుపులో పట్టే కంటే ఒక ముద్ద ఎక్కువే తినిపిస్తుంది అమ్మ. ఆ ముద్దలో ఆవకాయ, పెరుగు, పప్పుతో పాటు వాటన్నింటినీ మించిన రుచికరమైన తన ప్రేమను కూడా కలిపి తినిపిస్తుంది. అయితే..  ప్రేమను కలుపుతారో లేదో తెలియదు కానీ..  లండన్ లోని ఓ రెస్టారెం ట్ లో మాత్రం కొసరి కొసరి మరీ గోరుముద్దలు తినిపిస్తారు సర్వర్లు.

ఏదైనా హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్తే ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఫుడ్ ని ఆర్డరిస్తం. బాగా ఆకలిగా ఉంటే.. స్పీడ్ గా లాగించేస్తాం. నచ్చిన ఫుడ్ అయితే.. లొట్టలేసుకుంటూ తింటాం . కానీ.. లండన్ లోని ఓ రెస్టారెంట్ లో సర్వర్లే.. మనం ఆర్డరిచ్చిన ఫుడ్ తీసుకొచ్చి, వారి స్వహస్తాలతో మనకు తినిపిస్తా రు. లండన్ లోని మార్లేబోన్ అనే పట్టణంలో బ్లాం డ్ ఫోర్డ్​ స్ట్రీట్ నెంబర్ 71లో ఓ రెస్టారెంట్ ఉంది. ఆకలేసి ఆ రెస్టారెంట్ లోకి వెళ్తే..  మనం ఆర్డరిచ్చిన ఫుడ్ ని తెచ్చి టేబుల్ మీద పెట్టడమే కాదు.. ఏకంగా తినిపిస్తారు కూడా.

టేస్ట్​ కార్డ్​,  ఫెంగ్ సుషీ అనే రెండు రెస్టారెంట్ లు కలిసి.. సంయుక్తంగా ‘హ్యాండ్స్​ ఆఫ్ ’ అనే పాపప్ రెస్టా రెం ట్ ను ప్రారంభించడానికి ఏర్పాట్ లు చేస్తున్నారు. దీనికంటే ముందుగా జూన్ 11 నుంచి 14 వరకు ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో కస్టమర్లకు సర్వర్లే స్వయంగా వడ్డిం చి తినిపిస్తా రు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఈ సర్వీస్ ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా? ప్రపంచంలోని పేద చిన్నారులకు ఆహారాన్ని అందించాలన్న ఆలోచనతో ‘మేరీస్ మీల్ ’ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ లో తినాలంటే.. 20 పౌండ్లు చెల్లించాలి. అంటే.. మన కరెన్సీలో రూ.1761 చెల్లించాలి. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని చారిటీకి ఇస్తారు. అలాగని.. ఈ కార్యక్రమంలో పెట్టే ఫుడ్ మామూలు ఫుడ్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్​ అన్నీ ఇక్కడ లభిస్తాయి.

చైనా పాన్ కేక్, నిపాన్ మాక్డన్ సాల్మాన్, ట్యూనా, జపాన్ ఆమ్లెట్, వెజ్ రోల్స్​, జపాన్ రైస్ కేక్, స్ట్రాబెర్రీ మోచీ వంటి వెరైటీ ఆహారాన్ని పదార్థాలు ఇక్కడ వడ్డిస్తారు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే సర్వర్లు తీసుకొచ్చి చెంచాలతో కొసరి కొసరి తినిపిస్తారు. పాపప్ రెస్టారెంట్స్​ అంటే.. తాత్కాలింగా ఒక చోట రెస్టారెంట్ ఓపెన్ చేసి.. దాని ద్వారా ఒక కార్యక్రమం నిర్వహించి తద్వారా వచ్చిన ఫండ్ ని అనాథాశ్రమాలకు, పేదల అవసరాలు తీర్చడానికి ఖర్చు పెడతారు.