మిల్లెట్ పుడ్ .. మస్త్ టేస్ట్

మిల్లెట్ పుడ్ .. మస్త్ టేస్ట్
  • మిల్లెట్ పుడ్ ..మస్త్ టేస్ట్
  • హైదరాబాద్ లో పెరుగుతున్న రెస్టారెంట్స్, హోటల్స్
  • డిఫరెంట్ ఫుడ్​ఐటెమ్స్ తయారు
  • కస్టమర్లను ఆకర్షిస్తున్న నిర్వాహకులు

హైదరాబాద్, వెలుగు:  సిటీలో మిల్లెట్ ఫుడ్ పై జనాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువైంది. కరోనా తర్వాత సంప్రదాయ వంటలను తినేందుకు చాలా మంది ప్రయారిటీ ఇస్తున్నారు. చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు వంటి వాటితో చేసిన ఫుడ్ ను రోజులో ఒక్కసారైనా టెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా అందుకు తగ్గట్టుగానే డిమాండ్​కూడా పెరిగింది. మిల్లెట్స్ స్టోర్స్, హోటల్స్​కూడా స్టార్ట్ చేశారు. 2023 ఏడాదిని ఐక్యరాజ్యసమితి  మిల్లెట్స్ ఇయర్​గా ప్రకటించింది. మనదేశం కూడా మిల్లెట్స్ ప్రాముఖ్యతను గుర్తించి ప్రజల్లో అవగాహన కలిగిస్తుంది. ఇందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుంది. దీంతో మిల్లెట్స్​వాడకం కూడా పెరుగుతుంది. 

పెరుగుతున్న స్టోర్స్​, హోటల్స్​

సిటీలో చాలాప్రాంతాల్లో మిల్లెట్ స్టోర్స్ ను ప్రారంభిస్తున్నారు.  హోటళ్లు, రెస్టారెంట్స్, కెఫేలు కూడా ఓపెన్ చేస్తున్నారు. రెడీ టు ఈట్​, రెడీ టు కుక్ పేరుతో​నూడుల్స్, పాస్త, బిస్కెట్స్,​కుకీస్​, ఎనర్జీ బార్స్​వంటి ప్రొడక్ట్స్ ను కూడా కొన్ని మిల్లెట్​స్టోర్స్ తీసుకొచ్చాయి ​. రెస్టారెంట్స్​, హోటల్స్ లో మిల్లెట్స్​టిఫిన్స్​అందుబాటులో ఉంటున్నాయి. మిల్లెట్​కిచిడి, నిమ్మ మిల్లెట్,​ పులావ్, ​రాగి లడ్డు, జొన్న ఉప్మా, జావర్​పాప్ కార్న్, మల్టీ గ్రెయిన్ రోటీ, రాగి బిస్కెట్లు, కుకీలు, రాగి జావా, రాగి రవ్వ, అరికెలు, రాగులతో చేసిన ఇడ్లీలు, కొర్రలతో చేసిన దోసలు, ఊతప్ప, పొంగనాలు, జొన్నలతో చేసిన పొంగల్​, రాగితో చేసిన అంబలి వంటి వెరైటీస్​ను చేస్తున్నారు. మిల్లెట్​ఫుడ్​లవర్స్ ను ఆకర్షిస్తున్నారు. 

మిల్లెట్ ఫుడ్ తీసుకుంటే.. 

మిల్లెట్స్​లో కాల్షియం, మినరల్స్​, ప్రోటీన్స్​, విటమిన్స్​, పీచు పదర్థాం, ఐరన్​ పుష్కలంగా లభిస్తాయి.  మిల్లెట్స్​ ఫుడ్ తొందరగా డైజెషన్​కావడమే కాకుండా అతి తక్కువ గ్లైసిమిక్​సూచికను కలిగి ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్స్​ అధికంగా ఉంటాయి. మిల్లెట్స్​ను ఫుడ్ గా తీసుకుంటే క్యాన్సర్​, గుండెజబ్బులు రావు.  దీంతో డయాబెటీస్, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు ఫుడ్​కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. యూత్​లో కూడా అవగాహన పెరిగింది. హెల్దీ ఫుడ్​ను తీసుకుంటున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. 

రెడీ టూ కుక్..​ఈట్​కు ప్రయారిటీ 

సిటీ జనాలది బిజీ లైఫ్. తక్కువ టైమ్​లోనే అన్నీ సిద్ధం కావాలి. అందుకే రెడీ టు ఈట్​, రెడీ టూ కుక్​ ప్రొడక్ట్స్​ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. కుకీస్​, నూడిల్స్​, ఎనర్జీ బార్స్, బిస్కెట్స్, పాస్త లాంటివి ఎక్కువగా తీసుకుంటారు.  
-నిరంజన్​, సీనియర్​సేల్స్ మేనేజర్, మిల్లెట్​బ్యాంక్​

డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నాం 

​సొంతంగా ఏదైనా బిజినెస్​పెట్టాలనే ఆలోచనతో ప్రైవేట్​లెక్చరర్ జాబ్ వదిలేశా. గత మే లో బడిహౌస్​హోటల్ ప్రారంభించా.  బాగా నడుస్తుంది. నలభై ఏండ్ల పై వారిని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేశా. రోటీన్​గా కాకుండా మిల్లెట్​ఇడ్లీ, దోస, ఊతప్ప, పొంగనాలు ఇలా డిఫరెంట్​వెరైటీస్​ చేస్తున్నాం. మిల్లెట్​ఫుడ్ పై యూత్​కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు. 
-కందుకూరి స్రవంతి, బడి హౌస్​, మిల్లెట్​ఫుడ్, బోడుప్పల్​