
గ్వాలియర్: ఇరానీ కప్‌ను రెస్టాఫ్ ఇండియా టీమ్ మరోసారి నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్‌తో ఆదివారం ముగిసిన ఇరానీ కప్ పోరులో రెస్ట్ టీమ్ 238 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 437 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 81/2 తో ఐదో రోజు ఆట కొనసాగించిన ఎంపీ రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 198 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ హిమాన్షు మంత్రి (51), హర్ష్ గాల్వి (48) టాప్ స్కోరర్లు. రెస్ట్ బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు, ముకేశ్, అతిత్ సేత్, పలకిత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.