విమాన టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లపై రిస్ట్రిక్షన్లను ఈ నెల 31 నుంచి తొలగిస్తం

విమాన టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లపై రిస్ట్రిక్షన్లను ఈ నెల 31 నుంచి తొలగిస్తం

ఈ నెల 31 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: విమాన టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లపై విధించిన రిస్ట్రిక్షన్లను ఈ నెల 31 నుంచి తొలగిస్తామని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రావెల్‌‌‌‌‌‌‌‌పై కరోనా రిస్ట్రిక్షన్లను తీసేశాక  ఒక్కసారిగా పెంటప్ డిమాండ్ పెరగడం చూశాం. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు విమాన టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్లను ఇష్టమొచ్చినట్టు పెంచకుండా ఉండేందుకు  టికెట్‌‌‌‌‌‌‌‌ ధరలపై ప్రభుత్వం పరిమితులు పెట్టింది.  విమానం ప్రయాణించే దూరం బట్టి టికెట్‌‌‌‌‌‌‌‌ కనిష్ట, గరిష్ట రేట్లను నిర్ణయించింది. ఈ రిస్ట్రిక్షన్లను తొలగిస్తామని తాజాగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించింది.  కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన దేశ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసేవారు పెరుగుతున్నారు.

గత ఎనిమిదేళ్లలో మొదటి సారిగా ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో ఓ కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ తన సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించింది. జెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యూయల్ రేట్లు స్థిరపడ్డాక దేశ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ టికెట్ల రేట్లపై విధించిన రిస్ట్రిక్షన్లను మరోసారి పరిశీలిస్తామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సిందియా మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. జెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యూయల్ రేట్లు ఈ మధ్య కాలంలో కొంత తగ్గినా, కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే ఇంకా గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి.   రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక జెట్ ఫ్యూయల్ రేట్లు విపరీతంగా పెరిగింది.  దీని ధర కరోనా ముందు లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 53,000 ఉండగా, ప్రస్తుతం రూ. 1,41,000 కు పెరిగింది. ఈ ఏడాది జెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యూయల్ రేటు లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 16 శాతం లేదా రూ. సుమారు 21 వేలు తగ్గింది.