మార్చి క్వార్టర్లో తగ్గిన బ్యాంకు లోన్లు

మార్చి క్వార్టర్లో తగ్గిన బ్యాంకు లోన్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో రిటైల్ క్రెడిట్ సెగ్మెంట్ (హోమ్‌‌‌‌, వెహికల్‌‌‌‌, పర్సనల్ లోన్లు వంటివి) మందగమనంలో కొనసాగింది. మార్చి 2025లో కొత్త లోన్ ఆరిజినేషన్స్ (కొత్త లోన్లు) 5 శాతం వృద్ధి  చెందాయి.  గత ఏడాది మార్చిలో నమోదైన 12శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఫిబ్రవరిలో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తన బెంచ్‌‌‌‌మార్క్ లెండింగ్ రేట్‌‌‌‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతం చేసినప్పటికీ ఈ స్లోడౌన్ జరిగింది. సిబిల్ తాజా రిపోర్ట్ ప్రకారం,  క్రెడిట్ మార్కెట్ ఇండికేటర్ (సీఎంఐ) రెండేళ్ల కనిష్టానికి, అంటే 97కి పడిపోయింది.

సీఎంఐ ఎక్కువగా ఉంటే క్రెడిట్ మార్కెట్ హెల్త్ మెరుగవుతోందని, తక్కువగా ఉంటే క్షీణిస్తోందని అర్థం. యువ కన్జూమర్ల నుంచి క్రెడిట్ డిమాండ్ తగ్గింది.  మార్చి 2025తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో 35 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్ల నుంచి వచ్చిన క్రెడిట్ ఎంక్వైరీలు మొత్తం ఎంక్వైరీలలో  56శాతానికి తగ్గాయి.  గత ఏడాది మార్చి 2024 క్వార్టర్‌‌‌‌లో ఇది 58శాతంగా ఉంది.  పెద్ద అమౌంట్‌‌‌‌ హోమ్ లోన్స్, టూ-వీలర్ లోన్స్ వాటా పెరగడం చూస్తే, ఈ  సెగ్మెంట్లకు డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది.